ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్ హీరోలు ప్రేమలో పడుతున్నారు. ఇక అందులో ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పేరు కూడా వినిపిస్తుంది.అంతేకాదు ఒక ఫోటోతో క్లారిటీ కూడా వచ్చింది. ఇక మరి ఆ హీరోయిన్ ఎవరు? అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాజావారు రాణి గారు అనే సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.ఈయన ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ సినిమా తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో మరింత ఫేమస్ అయ్యారు.అలాగే సెబాస్టియన్ పీసీ 524, నేను మీకు బాగా కావాల్సిన వాడిని,సమ్మతమే, ఇక ఈ మధ్యకాలంలో వినరో భాగ్యం విష్ణు కథ వంటి సినిమాలతో యంగ్ హీరో గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇక ఈ మధ్యనే ఈయన నటించిన వినరో భాగ్యం విష్ణు కథ అనే సినిమా విడుదలై ఆయన ఖాతాలో మరొక హిట్ పడింది. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా కిరణ్ అబ్బవరం ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారు అంటూ ఒక వార్తా సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతుంది.
మరి ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా.. ఆమె ఎవరో కాదు కిరణ్ అబ్బవరం మొదటి సినిమా అయిన రాజా వారు రాణి గారు అనే సినిమాలో హీరోయిన్ రహస్య గోరఖ్.అయితే ఈ సినిమాలో నటించాక ఈ హీరోయిన్ కి అంతగా అవకాశాలు రాకపోయినప్పటికీ ఈ యంగ్ హీరోకి మాత్రం అవకాశాలు బాగానే వస్తున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఈ మధ్యనే కిరణ్ కాశ్మీర్ ట్రిప్ కి వెళ్ళాడు.
ఇక అక్కడ దిగిన ఒక ఫోటోని తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశాడు.ఆ టైంలోనే రహస్య గోరక్ కూడా ఒక ఫోటో షేర్ చేయడంతో ఆ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉన్నాయి.అయితే బ్యాగ్రౌండ్స్ సేమ్ ఉండొచ్చు కానీ ఇద్దరు దిగిన ఫోటోలో ఒకటేరకమైన కుక్క ఉంది. దాంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో పడ్డారని ఇద్దరు కలిసే వెకేషన్ కి వెళ్లారు అంటూ చాలామంది ఓ క్లారిటీకి వచ్చారు. మరి ఇందులో నిజమెంతో అబద్ధం ఎంతో తెలియాలంటే ఈ హీరో కచ్చితంగా స్పందించాల్సిందే.