తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన నటనా టాలెంట్ తో దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏక చత్రాధిపత్యంగా ఏలిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పుకోవచ్చు. అంతే కాదు ఈయనకు అంత గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ఈయనకు సినీ బ్యాగ్రౌండ్ ఏమీ లేకుండానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి అన్నా..మెగా ఫ్యామిలీ అన్నా..ఇండస్ట్రీలో మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయి.
ఇక మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమై స్టార్ హీరోలుగా మారారు.అయితే చిరంజీవి వారసుడు రామ్ చరణ్ కూడా చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా లోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లో చోటు దక్కించుకోవడం వల్ల అమెరికా వెళ్లి ప్రమోషన్స్ లో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఓ ఇంటర్వ్యూలో రాంచరణ్ మాట్లాడుతూ మా నాన్న నా గురించి ఎన్నో త్యాగాలు చేశారు. అంతే కాదు మా నాన్న చిన్నప్పటినుండే నాకు యాక్టింగ్ కి సంబంధించిన ఎన్నో క్లాసులు తీసుకునేవాడు. ఆయన షూటింగ్ ముగించుకొని రాగానే నాకు క్లాస్ తీసుకునేవాడు. అలాగే ఆదివారం కూడా ఆయన షూటింగ్ మానేసి నాకోసమే కేటాయించేవాడు.
ఇక అలాంటి టైం లో నాకోసం ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను సైతం మా నాన్న వదిలేసుకున్నారు. అలా తన సినీ కెరియర్ లో కొంత భాగాన్ని నాకోసం త్యాగం చేసి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మార్చారు అంటూ రామ్ చరణ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.ప్రస్తుతం రాంచరణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.