పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది ఇంచుమించు 27 ఏళ్లు పూర్తయింది. అలానే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చి కూడా 10 ఏళ్ళు అవుతుంది. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసి సుమారు 10 ఏళ్లు అవుతోంది పవన్ కళ్యాణ్ ఇటు సినిమా రంగంలో అటు రాజకీయాల్లో కూడా దూసుకు వెళ్ళిపోతున్నారు.
పవన్ కళ్యాణ్ గురించి టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన ఏ ఎం రత్నం కొన్ని కామెంట్స్ చేశారు అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో పాటుగా రత్నం చాలా సినిమాలు ఇప్పటికీ తెర మీద కి తీసుకురావడం జరిగింది పవన్ కళ్యాణ్ కి మనసు ప్రజలపై ఉంటే తనువు వెండి తెర మీద ఉందని ఆయన చెప్పారు అలానే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ సినిమాల్లో కూడా అందరి మనసును గెలుచుకున్నారని చెప్పారు రత్నం.
పవన్ కళ్యాణ్ రత్నం కాంబినేషన్లో హరిహర వీరమల్లు సినిమా రాబోతోంది ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. జూన్ నెల నుండి కూడా రెగ్యులర్ షూట్ ప్రారంభం కాబోతోంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాతో దూసుకు వెళ్ళిపోతున్నారు.
హరిహర వీరమల్లు చేస్తున్నారు. వినోదాయ సిత్తం సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అలానే ఉస్మాత్ భగత్ సింగ్ సినిమా కూడా చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా దసరాకి కానుకగా రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది. 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమాని తీసుకువస్తున్నారని టాక్. అలానే ఈ సినిమాకి సంబంధించి పలు వార్తలు షికార్లు కొడుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ గా తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే సినిమాకి పవన్ కళ్యాణ్ 75 కోట్ల నుండి 80 కోట్లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.