ఎప్పటి నుండో ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్న అపురూపమైన ఘట్టం వచ్చింది అని అందరూ సంతోష పడుతున్నారు.విషయంలోకి వెళ్తే ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నెలకు ఒక్కసారైనా ప్రభాస్ కి హీరోయిన్ లతో లేదా ఇతరులతో పెళ్లి అంటూ కుప్పలు తెప్పలుగా వార్తలు ప్రచారం చేస్తారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన చేతిలో ఇప్పటికే అరడజను సినిమాల వరకు ఉన్నాయి.
అయితే ఈ మధ్యకాలంలో ప్రభాస్ కాస్త అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ అందరూ నా పెళ్లి గురించి ప్రస్తావిస్తున్నారు. కానీ ఇప్పుడప్పుడే నేను పెళ్లి చేసుకోవడం లేదు.నా చేతిలో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా మీకే ఆ విషయం ముందు చెబుతాను.అప్పటివరకు వెయిట్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు.
అయితే ప్రభాస్ మాట్లాడిన మాటలు ప్రభాస్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించినప్పటికీ పెళ్లి మాత్రం చేసుకుంటారు కదా అంటూ సంబరపడి పోతున్నారు. ఇక ఈ మధ్యనే ప్రభాస్ కి కృతి సనన్ కి మాల్దీవ్స్ లో ఎంగేజ్మెంట్ అంటూ ప్రముఖ సినీ క్రిటిక్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సందు ట్వీట్ చేయడం సంచలన సృష్టించింది. కానీ ఆ తర్వాత ప్రభాస్ టీం వాళ్ళు స్పందించి అలాంటిదేమీ లేదు అని చెప్పడంతో ఆ వార్తలు అక్కడితో ఆగిపోయాయి. ప్రస్తుతం ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వడంతో అందరూ సైలెంట్ అయ్యారు.