ఇండియా వచ్చాక రామ్ చరణ్ కి పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్న చిరంజీవి.. ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఇండస్ట్రీని ఏలారు. అలాంటి చిరంజీవి వారసుడిగా రాంచరణ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తండ్రికి మించిన తనయుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే ఆర్ఆర్ఆర్ సినిమా లోని నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలోఎంపికై ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఆస్కార్ కోసం అని రాంచరణ్ ఎప్పుడో అమెరికాకి పయనమయ్యారు. అంతే కాదు అక్కడ అమెరికాలోని పలు హాలీవుడ్ ఇంటర్వ్యూలలో పాల్గొని రాంచరణ్ గురించి అలాగే చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.ఇక తన కొడుకు చెప్పే విషయాలన్నీ చిరంజీవి చూసి మురిసిపోయాడు. అంతేకాదు ఆస్కార్ అవార్డ్ రావడానికి రాంచరణ్ కూడా ఒక భాగమైనందుకు చిరంజీవి చాలా మురిసిపోతున్నాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఇండియాకి తిరిగి రాగానే చిరంజీవి ఆయనకు ఒక మంచి వెల్కమ్ పార్టీ ఇవ్వాలని చూస్తున్నారట.

అంతేకాదు ఆ వెల్కమ్ పార్టీలో సినిమా సెలబ్రిటీలు అలాగే కుటుంబ సభ్యులు అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ప్రతి ఒక్కరిని పిలిచి మంచి పార్టీ ఇచ్చి అలాగే ఆ పార్టీలో రాంచరణ్ కి నచ్చిన ప్రతి ఫుడ్ ఐటమ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఇప్పటికే రామ్ చరణ్ వచ్చాక ఒక సర్ప్రైజ్ ఇద్దామని ఆయనకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా కొన్నట్టు సమాచారం. మరి ఇంతకీ రామ్ చరణ్ కోసం చిరంజీవి కొన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలియాలంటే రాంచరణ్ వచ్చేవరకు ఆగాల్సిందే.