పొన్నంబలం స్టంట్ మాన్ గా విలన్ గా చక్కటి గుర్తింపు ని తెచ్చుకున్నాడు తన నటనతో అందర్నీ మెప్పించాడు పొన్నంబలం. మెగా స్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఘరానా మొగుడు సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గత సంవత్సరం పొన్నంబలం కిడ్నీ సమస్య తో బాధ పడ్డాడు తన అనారోగ్య సమస్యకి కారణం ఇదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక దీని కోసం వివరాలను చూస్తే..
తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నాడు. సొంత తమ్ముడే తనని చంపడానికి ప్రయత్నించాడని అన్నాడు. మద్యం తాగడం మూలంగా కిడ్నీలు పాడయ్యాయని అందరూ అనుకుంటున్నారు కానీ అదేమీ నిజం కాదని అన్నాడు. నా వాళ్లే నన్ను చంపడానికి ట్రై చేసారని… నా తండ్రికి నలుగురు భార్యలు అని అన్నాడు.
మూడో భార్య కుమారుడిని నా సొంత తమ్ముడిగా నేను అనుకున్నా అందుకే మేనేజర్‌గా ఉద్యోగం ఇచ్చానని అన్నాడు. చాలా నమ్మా వృత్తిపరమైన విషయాలన్నీ ఆ తమ్ముడే చూసుకునే వాడు అని అన్నాడు. నేను తాగే బీర్‌లో స్లో పాయిజన్ ని అతను వేసేశాడని అన్నాడు. కానీ అతను నా ఎదుగుదల చూసి ఓర్వలేక పోయాడన్నాడు. అలానే చేతబడి చేయించాడని కూడా చెప్పాడు. ఆ కారణం గానే నా కిడ్నీలు దెబ్బతిన్నాయి. విష ప్రయోగం జరగడం వల్లే ఇలా అయ్యింది అని డాక్టర్లు చెప్పారన్నారు.
మెగాస్టార్ చిరంజీవి గారే కిడ్నీల చికిత్స కోసం సహాయం చేసారని అన్నాడు పొన్నంబలం. చెన్నై లోని అపోలో ఆసుపత్రి నుంచి నీకు ఫోన్ వస్తుంది. అక్కడికి వెళ్లి అడ్మిట్ అయ్యిపో అని చిరంజీవి చెప్పారని అన్నాడు. ట్రీట్మెంట్ కి రూ.40 లక్షలు అయ్యాయి. అంతా చిరంజీవే ఇచ్చారని అన్నాడు.