తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ ఒక స్టార్ హీరోగా ఒక ప్రత్యేకమైనటు వంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఆరు పదుల వయసు లో కూడా కుర్రహీరోలతో పోటీపడుతూ సినిమాలు తీస్తూ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతూ జై బాలయ్య అనిపించుకుంటున్నారు.. అలాంటి బాలయ్య పైకి గంభీరంగా కనిపించినా కానీ లోపల మాత్రం చాలా మంచి వ్యక్తి.
ఎవరు ఆయన ను అవసరం కోరి వచ్చిన కాదనకుండా ఇచ్చేస్తారట. ఒకప్పుడు బాలకృష్ణ ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. కానీ ప్రస్తుతం ఆయన ఎక్కువగా డ్యూయల్ రోల్స్ సినిమాలే తప్ప వేరే సినిమాలు చేయడం లేదని కొంతమంది భావిస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం ఈ విషయంలో తప్పంతా డైరెక్టర్ లేదే, బాలకృష్ణ తప్పేం లేద ని అంటున్నారు. ఎందుకంటే వాళ్లు అలాంటి స్క్రిప్ట్ తో బాలయ్య దగ్గరికి వస్తున్నారు.
ఆయన కూడా అవే ఓకే చేస్తున్నారు. ఒకరిని మించిన మాస్ సినిమా ఒకరు చేస్తున్నారు అలా యాక్షన్ సినిమా లను హైలెట్ చేసుకోవడానికి బాలయ్యను రెండు పాత్రల్లో చూపిస్తున్నారు అని కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే బాలయ్య మంచి నటుడు ఆయన్ని సరిగ్గా వాడుకునే శక్తి డైరెక్టర్లకు ఉండా లని మరి కొంతమంది ఆయన అభిమానులు అంటున్నారు.