పెళ్ళి పీటలు ఎక్కబోతున్న దేవి శ్రీ ప్రసాద్.. అమ్మాయి ఎవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ సంగీత దర్శకులలో దేవిశ్రీప్రసాద్ ఒకరు. దేవి మూవీ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టిన దేవిశ్రీ చాలా తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సాధించారు. తెలుగులో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలకు మ్యూజిక్ అందించారు. కొన్నాళ్లకు తమన్ ఎంట్రీ ఇవ్వడంతో దేవిశ్రీప్రసాద్ అంతగా చాన్సులు రావట్లేదు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్ హవానే ఎక్కువగా కొనసాగుతోంది.

ఏది ఏమైనా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ కూడా చాలా సినిమాల్లో బిజీగానే ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమాతో దేవిశ్రీప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సాధించారు. అయితే గతంలో దేవిశ్రీప్రసాద్ హీరోయిన్ ఛార్మితో ప్రేమాయానం నడిపిన విషయం మనందరికీ తెలుసు. పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అన్నారు కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అంటారు.

ఇక తన తండ్రి మరణించిన తర్వాత దేవిశ్రీ పెళ్లిపై ఆసక్తి కనబడటం లేదని సమాచారం అందింది. ఈ తరణంలోనే వారి సన్నిహితులు, బంధువులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో దేవిశ్రీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు సమాచారం. ఇంతకీ ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరయ్యా అంటే.. వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారట. ఇక మరో చెప్పదగ్గ విషయం ఏంటంటే ఈ వివాహానికి సినీ ప్రముఖులు ఎవరు కూడా హాజరుకారట.

దీని ప్రధాన కారణం ఆయన సింపుల్గా మ్యారేజ్ చేసుకోవాలని చూస్తున్నారట. ఆ తర్వాత గ్రాండ్ గా వెడ్డింగ్ అనౌన్స్ చేసే విధంగా దేవిశ్రీప్రసాద్ ప్లాన్ చేసుకున్నారట. దీంతో మరోసారి దేవి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. మరి దీనిపై దేవిశ్రీప్రసాద్ అధికారికంగా బయట పెడితే గాని అసలు విషయం బయటకు రాదు.