హరికృష్ణ చేసిన ఆ పని వల్లే జూ.ఎన్టీఆర్ సినీ కెరియర్ సక్సెస్ అయ్యిందా..?

నందమూరి హరికృష్ణ రెండో భార్య కొడుకు జూనియర్ ఎన్టీఆర్ అని చాలామందికి తెలుసు. అయితే రెండో భార్య కొడుకు అవడం వల్లే నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ని దగ్గరికి రానివ్వలేదు. కానీ ఎప్పుడైతే ఆయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారో అప్పటినుండి ఈయన ను అందరూ దగ్గరికి తీశారు. ఈయన నిన్ను చూడాలని అనే సినిమాతో ఇండస్ట్రీ కి మొదటిసారి హీరోగా పరిచయం అయ్యారు.

అయితే ఈయన నటించిన సింహాద్రి సినిమాతో ఈయనకు స్టార్డం లభించింది. ఆ తర్వాత వరస సినిమాల్లో నటించాడు. కానీ ఈయనకు శక్తి సినిమా నుండి రభస సినిమా వరకు వరుసగా ప్లాఫ్ లు వచ్చాయి. దాంతో ఈయన పేరుకి ఇండస్ట్రీలో కాస్త మార్కెట్ తగ్గింది. ఇక అలాంటి టైం లోనే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సినిమాలు ఎందుకు ఇలా ప్లాప్ అవుతున్నాయి అని భావించి తన జాతకాన్ని ఒకసారి ప్రముఖ జ్యోతిష్యుడికి చూపెట్టడంతో ఆయన జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయి అని చెప్పాడట.

ఇక ఆ దోషాలన్నీ పోయి మళ్లీ తన సినీ కెరియర్ సక్సెస్ అవ్వాలని జూనియర్ ఎన్టీఆర్ తో కొన్ని యజ్ఞాలు, యాగాలు చేయించారట. ఇక అప్పటినుండి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వరుసగా సినిమాల్లో సక్సెస్ అయ్యారు. అలా ఆరోజు హరికృష్ణ చేసిన పని వల్లే జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరియర్ సక్సెస్ అయిందని ఈ విషయం తెలిసి చాలామంది నందమూరి అభిమానులు భావిస్తున్నారు.