జక్కన్న..ఈయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలు అంటే ఇష్టపడని వారు ఉండరు.. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క అపజయం కూడా లేని స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సాధించారు రాజమౌళి.. ఆయన ఏ సినిమా తీసినా అందులో ఏదో ఒక కాన్సెప్ట్ తప్పనిసరిగా ఉంటుంది. అలా బాహుబలి సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును అందుకున్నారు. బాహుబలి సినిమాను రెండు పార్ట్ లుగా తీసుకువచ్చి విజయం అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేశారు.
అలాంటి రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు కావడం తెలుగు వారికి గర్వకారణం అని చెప్పవచ్చు. అయితే ఈ మూవీ తర్వాత ఆయన ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లో చాలా గ్రాండ్ గా తెరకెక్కించి తీసుకొచ్చారు. ఈ సినిమా కూడా బాహుబలిని మించి హిట్ అయింది. అంతేకాదు ఆస్కార్ అవార్డు కూడా అందుకొని రికార్డులు క్రియేట్ చేసింది. అలాంటి రాజమౌళి RRR చిత్రాన్ని 2010లోనే ఆ ఇద్దరు మల్టీ స్టారర్ లతో చేద్దాం అనుకున్నారట..
ఇంతకీ వారు ఎవరయ్యా అంటే .. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్.. కానీ ఆ ఇద్దరు స్టార్ ల ఫ్యాన్స్ మధ్య గొడవలు వస్తాయని ఇన్ని రోజులు వెయిట్ చేశారు. అయితే రాజమౌళి బహుబలి తెరకెక్కించిన తర్వాత మరో సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో మనందరికీ తెలుసు.. ఆ ఎదురు చూపులకు న్యాయం చేయాలంటే మల్టీ స్టారర్ సినిమా తీయాలని ఎన్టీఆర్ మరియు రాంచరణ్ లను హీరోలుగా పెట్టి ఆర్ ఆర్ ఆర్ సినిమాలు తెరకెక్కించి ఘన విజయాన్ని అందుకున్నాడు.