నటుడు శివ కృష్ణ మీకు తెలిసే ఉంటుంది. శివ కృష్ణ జయం సినిమా లో సదా తండ్రి పాత్ర చేశారు. తాజాగా ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసుకున్నాడు. నేను సెన్సార్ బోర్డ్ మెంబర్ గా ఉన్నప్పుడు ట్రైలర్ యాడ్ కంటెంట్ కి కూడా సెన్సార్ చేయాలంటూ సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ రాసానని చెప్పారు. అలానే దూరదర్శన్ సహా ప్రైవేట్ ఛానెల్స్ లో వచ్చే సినిమాలకి కూడా సెన్సార్ చేయాలని చెప్పానని శివకృష్ణ అన్నారు.
మనం పద్ధతిగా సినిమాలను తీస్తామని ఇంగ్లీష్ వాళ్లయితే అన్ని తీసి పెట్టేస్తున్నారని శివకృష్ణ అన్నారు. దాంతో జనం అక్కడికి ఎగబడుతున్నారని చెప్పారు రీసెంట్ గా ఓటీటీ లో ఒక సినిమా చూశానని అన్నారు. అయితే దాన్ని చూస్తుంటే నా పిల్లలు వస్తుంటే ఆఫ్ చేసేస్తున్న.. ఎందుకు చూశాన్రా దేవుడా అనిపించింది అని అన్నారు. ఆల్ మోస్ట్ అది బ్లూ ఫిల్మే అని అన్నారు. ఓటీటీ కాదు ఎవరైనా సరే
సెన్సార్ చేయాలి అని అన్నారు.
అడల్ట్ కంటెంట్ ని థియేటర్స్ చూడాలనుకుంటే జనాలు డబ్బులు పెట్టి వస్తారు అని అన్నారు. కానీ ఓటీటీల్లో అలా కాదు ఇంట్లోనే అమ్మా నాన్న ఉంటే ఒకడు రూమ్ లో టిఫిన్ తింటూ ఇవే చూస్తాడంటూ అన్నారు. ఓటీటీ సినిమాల వల్లనే డ్రగ్స్‌కి బానిసలు అయిపోయినా చిన్నవాళ్లు సెక్స్‌లో పాల్గొంటున్నా అని అన్నారు. ఓటీటీకి సెన్సార్ ఉండాలి అని అన్నారు.
అలాంటి కంటెంట్ ఉన్నప్పుడు ఫ్యామిలీ తో కలిసి ఎలా చూస్తాము అని ఆయన అన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలు ఖూనీ చేస్తున్నారు అని అన్నారు. ఆయన రానా నాయుడు పేరు డైరెక్ట్‌గా ఏమి చెప్పలేదు. కానీ అదే అవ్వచ్చు. మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్‌లో రానా నాయుడు స్ట్రీమింగ్ అవుతోంది.