తారక రత్న చనిపోవడం ఎంతో బాధాకరం. ఫిబ్రవరి 18 న చనిపోయారు ఆయన. 23 రోజులగా అనారోగ్య సమస్య తో చికిత్స తీసుకుంటూ చనిపోయారు తారక రత్న. తారక రత్న చనిపోవడం తో అటు నందమూరి కుటుంబం ఇటు నారా కుటుంబం తీవ్ర విషాదాన్ని నెలకొంది. తారక రత్న బెంగళూరు లో నారాయణ హృదయాలయ ఆస్పత్రి లో ఆయన చికిత్స తీసుకున్నారు. అంతా ఆయన క్షేమంగా వచ్చేస్తారు అని భావించారు కానీ అలా అవ్వలేదు. తిరిగి రాణి లోకాలకి వెళ్లిపోయారు తారక రత్న.
ఇదిలా ఉండగా తారక రత్న జ్ఞాపకార్థం బాలకృష్ణ చేసిన మంచి పనికి జై బాలయ్య అని అలేఖ్య రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఇక అసలు ఏమైందో తెలుసుకుందాం.. తాజాగా తారక రత్న భార్య ఆలేఖ రెడ్డి సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. బసవతారకం ఆసుపత్రి లో తారక రత్న బ్లాక్ ని బాలకృష్ణ ఏర్పాటు చేశారు. ఇలా అయినా తన గొప్ప మనసుని చాటుకున్నారు.
తారక రత్న జ్ఞాపకార్థం గుండె పోటు సమస్యల తో బాధ పడుతున్న వారికి ఫ్రీగా ట్రీట్మెంట్ ని అందించాలని నిర్ణయించుకున్నారు. గుండె సమస్య తో బాధ పడుతూ చికిత్స ఖర్చులు భరించ లేని పేద వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ అందించాలని బాలకృష్ణ ఈ మంచి పనికి శ్రీకారం చుట్టారు.
ఆ బ్లాక్ పేరు తారకరత్న బ్లాక్ అని పేరు పెట్టారు. గుండె సమస్యల కి ఫ్రీగా బసవతారకం ఆసుపత్రి తో పాటుగా హిందూపురం లో బాలకృష్ణ నిర్మిస్తున్న ఆసుపత్రిలో కూడా మొదలు పెట్టనున్నారు. అలానే బాలకృష్ణ అలేఖ్య రెడ్డి తారక రత్న పిల్లల్ని చూసుకుంటారని బాధ్యత తీసుకుంటారని అండగా ఉంటానని కూడా చెప్పారు.