దాస‌రి టికెట్ ని పెంచమంటే.. సీఎం ప‌ద‌విలో ఉన్న ఎన్టీఆర్ ఏం అన్నారో తెలుసా..?

అన్నగారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక పక్క సినిమాలో మరొక పక్క రాజకీయాల్లో కూడా రాణించారు పైగా అన్నగారిని చాలామంది ఇష్టపడేవారు. అలానే దాసరి నారాయణరావు దేశం గర్వించ దగ్గ దర్శకుల్లో ఒకరు. టాలీవుడ్ లో దాసరి నారాయణరావు ఎంతగానో శ్రమించారు ఒక దర్శకుడిగా నటుడుగా రచయితగా గుర్తింపుని కూడా తెచ్చుకున్నారు దాసరి.

దాసరి నారాయణరావు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఇచ్చారు. దాసరి ఏడాదిలో కొన్ని పదుల సంఖ్యలో సినిమాలు తీసేవారు. పైగా ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు. ఒకసారి దాసరి నారాయణరావు గారు ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఆయన వద్దకు వెళ్లి ఒక కోరిక కోరారు సినిమా పరిశ్రమ నుండి ప్రతినిధి వర్గం ఆయన దగ్గరికి వెళ్లారు. దాసరి నారాయణరావు కీలకంగా ఉన్నారు. ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళితే ఎన్టీఆర్ ఏంటి సమస్య అని అడిగారు.

అయ్యా ఎగ్జిబిటర్లు బావురమ్మంటున్నారు అని దాసరి చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్ నాకు ఆరు సినిమా హాల్స్ ఉన్నాయి నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవరైనా ఉంటే తీసుకురా వాళ్ళ బాధను నేను వింటాను అని చెప్పి పంపించేశారు. అన్నగారు పెట్టిన స్లాబ్ పద్ధతి రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత తొలగించారు. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత 70 రూపాయలు గా ఉండే బాల్కనీ టికెట్ రేట్ ని 50 కి తగ్గించేశారు.

రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఇలా మార్పులు చేశారు. ఎన్టీఆర్ బొబ్బిలి పులి టైంలో ఈ విషయం జరిగింది ఈ విషయాన్ని స్వయంగా దాసరి నారాయణరావు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అలానే ఒకసారి ఎన్టీఆర్ దాసరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఎన్టీఆర్ ఉదయాన్నే సెట్ కి వచ్చారు. ఇంకా డైలాగులు రాసుకుంటున్న దాసరిని చూసి కోప్పడ్డారు ఉదయం 7 గంటల లోపు మొదటి షార్ట్ పూర్తి అవ్వాలని అనుకున్నాం కదా కానీ ఇంకా అలా జరగలేదని ఎన్టీఆర్ దాసరి తీరు నచ్చక ఆగ్రహంగా ఇంటికి వెళ్లిపోయారు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు.