హరికృష్ణ పెద్ద కోడలికి రెండో పెళ్లి జరిగిందనే విషయం మీకు తెలుసా..?

నందమూరి ఫ్యామిలీ లో ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీకి హీరోలు గా వచ్చి సెటిల్ అయిపోయారు .ఇక ఇందులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మాత్రం సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు అని చెప్పుకోవచ్చు. అలాగే హరికృష్ణ, కళ్యాణ్ రామ్,తారకరత్న లు కూడా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చారు. ఇక కళ్యాణ్ రామ్ ఈ మధ్యకాలం లో బింబిసార సినిమా తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

ఇదిలా ఉంటే చాలామంది కి నందమూరి హరికృష్ణ కి ఇద్దరు కొడుకులని తెలుసు. అయితే నందమూరి హరికృష్ణ కి ముగ్గురు కొడుకులు ఒక కూతురు..హరికృష్ణ మొదటి భార్య కు జానకి రామ్, కళ్యాణ్ రామ్, సుహాసిని పుట్టారు. అలాగే హరికృష్ణ రెండో భార్య శాలిని కి జూనియర్ ఎన్టీఆర్ పుట్టారు. ఇదిలా ఉంటే నందమూరి జానకిరామ్ చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక జానకిరామ్ చనిపోయే ముందే ఆయనకు పెళ్ళై ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి చాలామందికి తెలియదు.

అయితే జానకిరామ్ చనిపోయాక హరికృష్ణ పెద్ద మనసుతో తన పెద్ద కోడలికి రెండో పెళ్లి చేశారట. అయితే ఆమె రెండో పెళ్లి చేసుకున్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే కేవలం అది కొద్ది మంది సన్నిహితుల మధ్యనే హరికృష్ణ తన పెద్ద కోడలికి రెండో పెళ్లి చేశారు.అయితే ప్రస్తుతం ఈ వార్త తెలిసి చాలామంది అభిమానులు షాక్ అవుతున్నారు.