ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్నటువంటి నిర్మాతల్లో టాప్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించారు దిల్ రాజు . అలాంటి దిల్ రాజ్ సినిమా చేస్తున్నాడు అంటే అది చాలా బడ్జెట్ అయి ఉంటుందని అందరు అంచనా వేస్తారు. కానీ దిల్ రాజు తన రూటు మార్చి చిన్నచిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు.. సినిమా కథలో బలం ఉంటే చాలు కొత్త వాళ్లకు కూడా చాన్సులిస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. దీని వెనుక కూడా మంచి బిజినెస్ సెన్స్ ఉన్నాయని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు.
రీసెంట్గా రిలీజ్ అయి సూపర్ హిట్ అందుకున్న బలగం చిత్రాన్ని చాలా తక్కువ బడ్జెట్ తో తీసి ఘన విజయాన్ని అందుకున్నారు. అంతేకాకుండా ఆయన ఇంకా చాలా చిన్న సినిమాలు తీసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అటు రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే ఇటు వేణు లాంటి నటుడికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి అన్ని రకాల సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు దిల్ రాజ్. ఇదిలా ఉండగా దిల్ రాజు రామ్ చరణ్ తో సినిమా చేస్తూనే పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. అంతేకాదు ఇంకొంతమంది డైరెక్టర్లతో కథ గురించి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
అయితే ఇంతకుముందు చిత్రాలతో పోల్చుకుంటే దిల్ రాజు చిత్రాల్లో చాలా వరకు క్వాలిటీ తగ్గిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అప్పట్లో ఆయన నిర్మించిన కొత్త బంగారులోకం, బొమ్మరిల్లు వంటి సినిమాలు ఉదాహరణ.. కానీ ప్రస్తుతం ఆయన బలగం సినిమా మినహా మొన్నటి వరకు కమర్షియల్ చిత్రాలు చేస్తూ వచ్చారు. అప్పట్లో దిల్ రాజ్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు విపరీతమైన అంచనాలు ఉండేవి. కానీ ప్రస్తుతం అవి ఉండడం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆయన రూటు మార్చి ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాలు తీయడంలో ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.