జానకి కలగనలేదు సీరియల్ హీరో పారితోషికం ఎంతో తెలుసా..?

ఈ మధ్యకాలంలో టీవీ సీరియల్స్ కి చాలా పాపులారిటీ పెరిగింది.. ఆ మధ్యకాలంలో కార్తీకదీపం సీరియల్ ద్వారా నటి ప్రేమి విశ్వనాథ్ ఎంతటి పాపులర్ ని సంపాదించిందో మనందరికీ తెలుసు. ఒక హీరో హీరోయిన్ రేంజ్ లో ఆమెకు గుర్తింపు లభించింది.. ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ ఈ విధంగానే పాపులారిటీ సంపాదించుకుంది. ఇందులో హీరో హీరోయిన్ కూడా మంచి గుర్తింపుని తెచ్చుకుంటున్నారు. అలాంటి సీరియల్లో హీరోగా చేస్తున్న అమర్ దీప్ బాగానే పారితోషికం తీసుకుంటున్నారట..

ఇంతకీ ఆయన ఎంత తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.. స్టార్ మాలో ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. సిరిసిరిమువ్వలు సీరియల్ తో అశ్విన్ గా మంచి గుర్తింపు సాధించుకున్న అమర్ దీప్ ఇందులో హీరోగా చేస్తున్నారు. సీరియల్స్ లోకి రావడానికి అమర్దీప్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారట.

అలాంటి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రెమ్యూనరేషన్ గురించి బయటపెట్టారు. సిరిసిరిమువ్వలు సీరియల్ నెలకి 10 రోజులు షూటింగ్ ఉండేదట.. ఈ పది రోజులకు 80 వేల పారితోషకం అందుకున్నాడట. ప్రస్తుతం ఆయన చేసే జానకి కలగనలేదు సీరియల్ కి ఒక్క రోజుకి 10000 అందుకుంటున్నట్లు అమర్దీప్ చెప్పుకొచ్చాడు. ఈ లెక్కన చూస్తే ఆయన నెలకు లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటారని చెప్పకనే చెప్పేశాడు..