గత కొన్ని రోజులుగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈ విషయంలో ఎన్నోసార్లు మీనా క్లారిటీ ఇచ్చినప్పటికి వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇక విషయంలోకి వెళ్తే.. బాలనటిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మీనా ఆ తర్వాత హీరోయిన్ గా మారి చాలా సినిమాల్లో నటించింది.ఇక కెరియర్ పీక్స్ లో ఉండగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ ని పెళ్లి చేసుకుంది. మీనా పెళ్ళయ్యాక కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఒక పాప పుట్టాక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అమ్మ అత్త పాత్రల్లో నటిస్తోంది.
అయితే గత ఏడాది మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణాలతో మరణించారు. అయితే ఇప్పుడిప్పుడే ఆ బాధనుండి కోలుకుంటున్న మీనా సినిమాల్లో బిజీ అయిపోయింది.ఇక ఇలాంటి నేపథ్యంలో మీనాపై కొంతమంది పిచ్చి రాతలు రాస్తూ రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇక తాజాగా కొంతమంది గాసిప్ రాయుళ్ళు అయితే ఏకంగా తనకంటే చిన్నవాడైన తమిళ హీరోని మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందని, అయితే ఆ హీరోకి ఇప్పటికే పెళ్లై విడాకులు అయ్యాయని, దాంతో మీనా ఆ హీరో ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు అంటూ తాజాగా ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.
అయితే ఈ వార్తపై మీనా క్లోజ్ ఫ్రెండ్ క్లారిటీ ఇచ్చి ఇలాంటి వార్తలు రాసే వారిపై మండిపడింది.అలాంటిదేమీ లేకుండా ఆమెపై లేనిపోని వార్తలు ఎందుకురాస్తున్నారు.. ఇంకోసారి ఇలా చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.ఇక ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా ఇలాంటి చెత్త రూమర్స్ మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక తన కూతురు భవిష్యత్తు కోసం పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదు అని మీనా సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు.