అందుకే సీరియల్స్ లో తెలుగు అమ్మాయిలని తీసుకోరు.. షాకింగ్ విషయాలు చెప్పిన త్రినయని హాసిని..!

మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్ మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. ఈ సీరియల్స్ ద్వారా ఎంతోమంది నటీనటులు ఉపాధి పొందుతున్నారు. కానీ ఇందులో మన తెలుగు వాళ్ళ కంటే ఎక్కువగా బయట వాళ్లే ఉన్నారని త్రినయని సీరియల్ హాసిని షాకింగ్ విషయాలు బయట పెట్టింది. కారణాలు ఏంటో చూద్దాం .. తెలుగు సీరియల్స్ లో ఫస్ట్ సెకండ్ లీడ్స్ పాత్ర లకు తెలుగు వాళ్ళని కాకుండా బయటి వాళ్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారట. దీనికి ప్రధాన కారణం ఏంటో క్లియర్ గా చెప్పింది..

ముఖ్యంగా తెలుగులో బెంగళూరుకు చెందిన అమ్మాయిలు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వీరిలో డెడికేషన్ లెవెల్స్ చాలా బాగుంటాయని తెలిపింది. మొత్తం తెలుగులో ఆరు చానల్స్, ఇందులో మొత్తం 66 సీరియల్స్ ఉన్నాయి. వీటిలో మెయిన్ సెకండ్ కలిపి 122 మంది ఆర్టిస్టులు కావాలనుకోండి. మరి ఇప్పుడు అంతమంది తెలుగు అమ్మాయిలు లేరు కదా.. అందుకే బయట నుంచి తీసుకువస్తున్నారు. అంతే కాదు మన తెలుగు వాళ్ళు చెన్నై బెంగళూరులో కూడా చేస్తున్నారు.

కానీ నాకు తెలిసినంతవరకు బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయిలు డెడికేషన్ లెవెల్స్ బాగుంటాయని తెలియజేసింది. ఎక్కువగా తెలుగు అమ్మాయిలకు అయితే మెయిన్ లీడ్స్ వచ్చినప్పుడు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కెరియర్ సరిగా ప్లాన్ చేసుకోలేక పోతున్నారు. ఒకవేళ హీరోయిన్గా ఛాన్స్ వచ్చినా కానీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కండిషన్స్ వల్ల ఒప్పుకోవడం లేదని ఆమె అన్నారు. అందుకే తెలుగు అమ్మాయిలను ఎక్కువగా తెలుగు సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ లలో తీసుకోవడం లేదని ఆమె తెలియజేశారు.