దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తెలియని వారు ఉండరు. ఎన్నో సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్నారు.. అలాంటి కోడి రామకృష్ణ దాసరి నారాయణ శిష్యుడిగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్ డైరెక్టర్ అయ్యారు. మాస్ చిత్రాల నుండి క్లాస్ చిత్రాల వరకు ఎన్నో చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు. అలాంటి కోడి రామకృష్ణ కెరియర్ మొదట్లో టర్నింగ్ పాయింట్ ఇచ్చిన సినిమా మంగమ్మగారి మనవడు.. అప్పట్లో కమర్షియల్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది.
ఈ చిత్రంలో రామకృష్ణ దర్శకుడిగా అనేక ప్రయోగాలు చేశారని చెప్పవచ్చు. కోడి రామకృష్ణ ఇలాంటి సినిమాలు కాకుండా అరుంధతి, అంజి లాంటి భక్తిరస సినిమాలను కూడా తీశారు. కొన్ని సినిమాల్లో అయితే స్టార్ నటీనటులు లేకుండానే కమర్షియల్ హిట్లు అందుకున్నారు. టెక్నాలజీ లేని కాలంలో కూడా తన టాలెంట్ తో గ్రాఫిక్స్ ను సృష్టించాడు కోడి. ముఖ్యంగా మంగమ్మ గారి మనవడు చిత్రంలో చేపల పులుసు వై విజయ అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఇందులో విజయను చూపించిన తీరు ఎక్కడ అసభ్యం లేకుండానే కుర్రకారు ను గిలిగింతలు పెట్టేయవచ్చని ఆయన నిరూపించారు. ఈ చిత్రంలో వై. విజయ క్యారెక్టర్ సూపర్ హిట్ అయింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా తర్వాత ఈయన ప్రతి సినిమాలో ఈమెకు ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చేవారు. ఈ విధంగా వీరి మధ్య విపరీతమైన సాన్నిహిత్యం పెరిగి, వై.విజయను ఆయన ప్రత్యేకంగా ట్రీట్ చేసేవారట. దీంతో అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో వీరి మధ్య ఏదో నడుస్తుందని టాక్ వినిపించిందట. ఏమీ లేకుండా ఈ నటిని అన్ని సినిమాల్లో పెట్టుకోరు కదా అంటూ అప్పట్లో కొంతమంది అన్నారట.