ఉపాసన కామినేని.. ఈ పేరు చెబితే తెలియకపోవచ్చు కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది.ఈమె సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి ఉపాసన రాంచరణ్ ఇద్దరు ఒక క్లబ్ మీటింగ్లో మొదటిసారి కలుసుకున్నారు.ఇక తొలిచూపులోనే ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లికూడా చేసుకున్నారు.
అయితే మీ అందరికీ తెలియని మరొక విషయం ఏమిటంటే ఉపాసన రామ్ చరణ్ ఓకే దగ్గర చదువుకున్నారు. అంతే కాదు రామ్ చరణ్ ఉపాసనకి సీనియర్. రామ్ చరణ్ ఉపాసన చదువుకుంటున్న రోజుల్లో రామ్ చరణ్ కంటే ముందే మరో స్టార్ హీరో ఉపాసన ను గాఢంగా ప్రేమించాడట. అయితే చాలా రోజుల నుండి ఆ హీరో ఉపాసనని చూస్తూ వన్ సైడ్ లవ్ చేశారట. కానీ ఆ ప్రేమ విషయాన్ని చెప్పడానికి భయపడ్డారట.
అయితే ఓ రోజు ఎలాగైతే ఎలాగా అని తన ప్రేమ విషయాన్ని ఉపాసనకి చెబుదాం అనుకునే లోపే రామ్ చరణ్ ఉపాసన ప్రేమ విషయం మా హీరోకి తెలియడంతో తాను ఎంతో ప్రేమించిన ఉపాసనని మర్చిపోయాడు. ఇక మరొక విషయం ఏమిటంటే ఉపాసన రాంచరణ్ పెళ్లికి ఆ స్టార్ హీరో కూడా వచ్చాడట. ప్రస్తుతం ఆ హీరోకి కూడా పెళ్ళై పిల్లలు ఉన్నారు. ఇలా వేరే స్టార్ హీరో కి భార్య కావలసిన ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సతీమణి అయ్యింది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఆర్సి15 అనే సినిమాలో నటిస్తున్నారు.