ప్రపంచ రికార్డు సాధించిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా.. ఎలా అంటే..?

స్టార్ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా , రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.. ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే జయ జానకి నాయక.. ఈ చిత్రం టాలీవుడ్ లో భారీ విజయాన్నందుకున్న విషయం అందరికీ తెలుసు. అయితే ఈ యంగ్ హీరో సినిమా ఒక ప్రపంచ రికార్డును క్రియేట్ చేసిందట.

బోయపాటి డైరెక్షన్ వహించిన ఈ సినిమా 2017లో థియేటర్లోకి వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాంటి ఈ మూవీ గురించి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.. చిత్రం ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిందట.మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దామా.. బోయపాటి శ్రీను సినిమాలు అంటేనే యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి.

ఈ చిత్రం యూట్యూబ్ లో హిందీ వర్షన్ అందుబాటులో ఉన్నది. అయితే హిందీ వర్షన్ లో జయ జానకి నాయక సినిమాకి భారీ రెస్పాన్స్ వచ్చిందట. ప్రస్తుతం ట్రెండింగులో ఉన్న ఈ సినిమా తాజాగా ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. 709 వ్యూస్ కొల్లగొట్టి, ఇప్పటివరకు ఏ సినిమా సాధించినంత రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో ఇంత రికార్డు సాధించకపోయినా కానీ హిందీ ఆడియన్స్ కు మాత్రం బాగా కనెక్ట్ అయింది.

ఇక ఈ మూవీ తర్వాత కే.జి.ఎఫ్ మూవీ 702 కోట్ల వ్యూస్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రం బాలీవుడ్ లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ విధంగా బెల్లంకొండ శ్రీనివాస్ రికార్డు క్రియేట్ చేయడంతో ఆయన అభిమానులంతా సంతోష పడుతున్నారు.