పాపం అలాంటి వ్యాధి తో ఇబ్బంది పడుతున్న అనుష్క..!!

సూపర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అనుష్క శెట్టి.ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు రావడంతో కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాదు ఆమె సినీ కెరియర్లో అరుంధతి,నిశ్శబ్దం, పంచాక్షరీ, భాగమతి వంటి లేడి ఓరియెంటెడ్ సినిమాలు సైతం ఉన్నాయి. అప్పట్లో అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా ఉండేది.

అలా అనుష్క ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దాటినా కూడా ఇండస్ట్రీ లో ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే ఈ మధ్య కాలంలో అనుష్క కాస్త సినిమాలకు దూరంగా ఉంది. దానికి ప్రధాన కారణం ఆమె అధిక బరువు పెరగడమే. అధిక బరువు కారణంగా సినిమాల్లో అవకాశాలు కూడా రావడం లేదని సమాచారం. అయితే ఆమె చేతులారా తన సినీ కెరీర్ అని నాశనం చేసుకుంది..

ఎందుకంటే సైజ్ జీరో సినిమా స్టోరీ నచ్చి అందులో నటించడానికి ఒప్పుకొని ఆ సినిమా కోసం అధిక బరువు పెరిగింది.దాంతో ఆ సినిమా తర్వాత మళ్లీ తన బరువును ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నా కూడా అస్సలు తగ్గడం లేదట. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అనుష్క థైరాయిడ్ వ్యాధితో బాధపడుతుందని, ఆ వ్యాధి కారణంగానే అనుష్క బరువు తగ్గడం లేదు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ థైరాయిడ్ వల్లే అనుష్క అంత బరువు పెరిగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టి హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తోంది.