ఫేస్​బుక్ (Facebook), ఇన్​స్టాగ్రామ్ (Instagram) యూజర్లకు బ్యాడ్ న్యూస్..!!

ఈ మధ్య కాలంలో టెక్నాలజీ (technology) బాగా పెరిగిపోయింది. దాంతో మన పనులు కూడా ఈజీ అయిపోయాయి. టెక్నాలజీ పెరిగిపోవడంతో ప్రతిదీ కూడా క్షణాల్లో పూర్తయి పోతోంది. ఏమైనా పనులు ఉన్నా కూడా ఈజీగా మనం పూర్తి చేసుకోవచ్చు. అయితే టెక్నాలజీ కూడా రోజు రోజుకీ మారిపోతుంది. అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో రక రకాల యాప్స్ వంటివి వచ్చాయి. అవి అప్డేట్ అవుతూ ఉంటాయి కూడా. కొత్త రకం ఫీచర్లు కూడా ప్రతీ రోజూ వస్తుంటాయి.

ఇక పోతే ఇప్పుడు ట్విటర్ (twitter) బాటలో మెటా పయనిస్తోందా అంటే అవును అనే లాగే వుంది. నిజానికి కొత్త నిర్ణయాలు ని చూస్తుంటే అదే అనిపిస్తోంది. అయితే ట్విటర్ లాగే మెటా (meta) కూడా ఫేస్​బుక్ (facebook), ఇన్​స్టాగ్రామ్ ని చేయబోతున్నారు. దీనితో ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్ ఖాతాదారులకు షాక్ తగలనుంది. ఇక అసలు ఏ మార్పులు చేస్తారనేది చూస్తే…

బ్లూ టిక్ వెరిఫికేషన్ (blue tick verification) జనరల్ యూజర్లు బ్లూ టిక్ సర్టిఫికేషన్ వినియోగించుకోవాలంటే ఇప్పటి నుండి కూడా డబ్బులుని కట్టాల్సి వుంది. ఇది వరకైతే కేవలం మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా ప్రభావ శీలురు, ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలకు మాత్రమే బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ ని ఇచ్చేవి. కానీ ఆ రూల్ ని మార్చింది. సాధారణ వ్యక్తులు కూడా దీన్ని పొందచ్చట.

నెలవారీ ఫీజు పే చేసి బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ ని ఇక మీదట ఎవరైనా పొందచ్చని చెప్పింది. అమెరికా యూజర్లకే మెటా బ్లూ టిక్‌ ఫీచర్‌ ప్రస్తుతానికి అందుబాటులో ఉంది.ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్‌ సౌకర్యం పొందాలంటే ఆయా వ్యక్తి వయస్సు 18 ఏళ్లు దాటాల్సి ఉంటుంది. త్వరలో ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఈ ఫీచర్‌ రానుంది.