యూఎస్ లో లయ జాబ్.. జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు..?

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవ్ బేస్డ్ ఉన్న కథలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది హీరోయిన్ లయ. మొదట ఈమె ఇండస్ట్రీకి స్వయంవరం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాకే నంది అవార్డును సొంతం చేసుకుంది. దాదాపు 13 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగిన లయ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే అమెరికాకు చెందినటువంటి ఒక డాక్టర్ను పెళ్లి చేసుకుంది. తర్వాత అక్కడే స్థిరపడిపోయి ఉద్యోగం చేస్తూ భారీగా కూడా సంపాదించిందని తెలుస్తోంది.

ఈ మధ్యకాలంలో అమెరికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చారు. ఈ తరుణంలో పలు ఇంటర్వ్యూలలో హాజరవుతూ సందడి చేశారు. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తను యూఎస్ లో ఏం చేస్తున్నారో బయటపెట్టారు. 2011 నుంచి ఈమె ఐటీ సెక్టర్ ఉద్యోగం చేసేదానినని తెలియజేశారు. అయితే ఇండియాకు చెందిన కంపెనీకి తాను ఉద్యోగం చేసే దానిని వెల్లడించారు. ఆ టైంలో తన టాక్స్ లన్ని పోనూ నెలకు 12,000 డాలర్ల జీతం వచ్చేదని అన్నారు.

అయితే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం నెలకు 9,60,000 అన్నమాట. తర్వాత తాను 2017 లో జాబ్ వదిలేసానని అన్నారు. అనంతరం డాన్స్ స్కూల్ ప్రారంభించామని, కరోనా కారణంగా ఆ స్కూల్ కూడా మూతపడిందని లయ తెలియజేశారు. ఉద్యోగం చేసే సమయంలో భారీగానే డబ్బులు సంపాదించానని అన్నారు. చాలా కాలం తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చిన లయ హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, న్యూయార్క్ సిటీ కన్నా హైదరాబాద్ చాలా అందంగా ఉందని కామెంట్ చేశారు.