చరణ్ కి మాస్ పల్స్ తెలియడం లేదా!!

తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా మాస్ సినిమాలే నచ్చుతాయి అని చెప్పడానికి ప్రస్తుతం మన టాప్ హీరోలందరూ చేసే సినిమాలే నిదర్శనాలు. వారందరూ కూడా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చూస్తున్నారు.. అలాంటి సినిమాలే చేస్తున్నారు.. ప్రతి ఒక్క హీరో కూడా ఈ విధంగా చేయడం వల్ల ప్రయోగాలకు తావు లేకుండా పోయింది. కొంతమంది చిన్న హీరోలు ప్రయోగాలు చేస్తున్న కూడా వాటికి ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
ఇది ఇలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా ముందుకు పోతూ ఉండడం మెగా అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా యొక్క టైటిల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా యొక్క టైటిల్ను అనౌన్స్ చేసింది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సెలెక్ట్ చేసిన ఈ సినిమా యొక్క టైటిల్ పట్ల కొంతమంది మెగా అభిమానులు నిరాశగా ఉన్నారు.  ఇందులో మాస్ తగినట్లు ఉందని చరణ్ రేంజ్ లో ఈ సినిమా లేదని వారు వాపోతున్నారు. మరి ఈ సినిమా యొక్క కథకు తగ్గట్లుగానే టైటిల్ను సెలెక్ట్ చేయడం జరిగింది అని చిత్ర బృందం చెబుతున్న నేపథ్యంలో మెగా అభిమానులు ఈ సినిమాకు ఏ విధంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది ఇక్కడ అసలు విషయం.
ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత చరణ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ విధంగా ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.