చైతు,శర్వా ల పనైపోయిందా!!

naga chaitanya sharwanand movies not upto mark
సినిమా పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే ఎవరికైనా నాలుగు రోజులు ఉంటాయి. లేదంటే వారు ఎంతటి బ్యాగ్రౌండ్ ఉన్న వారైనా కూడా ప్యాకప్ చెప్పక తప్పదు. అలా ఇండస్ట్రీలో మహామహులైన వారసులు సినిమా పరిశ్రమలో రాణించలేక వెనుకబడిపోయి కనుమరుగైపోయారు. అలా ఈతరం కొంతమంది హీరోలు ప్రేక్షకులను అలరించలేక వారిని మెప్పించలేక రోజురోజుకు వెనక పడిపోతున్నారు. వారిలో అక్కినేని నాగచైతన్య ఒకరు అని చెప్పాలి.
నాగేశ్వరరావు మనవడిగా అక్కినేని నాగార్జున తనయుడిగా సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య మొదట్లో మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించి భవిష్యత్తు స్టార్ హీరోగా కనిపించాడు అయితే మధ్యలో కొన్ని రాంగ్ సినిమాల ఎంపికలను చేసుకొని ప్రేక్షకులను నిరాశపరిచాడు వ్యక్తిగత జీవితంలోను కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలు ఆయన కెరియర్ పై ఎంతో ప్రభావం చూపించాయి ఆ విధంగా ఆయన గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏ మాత్రం ఆలచించలేకపోతున్నారు.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు టాప్ స్టార్స్ అయిపోతుంటే ఎంతో బ్యాగ్రౌండ్ ఉండి కూడా మంచి సినిమాలను ఎంపిక చేసుకోలేక నాగచైతన్య రోజు రోజుకు వెనకబడిపోతుండడం జరిగింది. అలా ఆయన కెరియర్ ఇప్పుడు ఎంతో ప్రమాదంలో ఉందని చెప్పాలి. అలా ఆయన చేస్తున్న కస్టడీ సినిమా చైతు కెరియర్ కు ఎంతో కీలకం అని చెప్పాలి. ఇటు హీరో శర్వానంద్ కూడా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోతున్నాడు. దాదాపు అరడజను సినిమాలకు పైగా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయారు. దాంతో ఆయన కెరియర్ కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉంది అని చెప్పాలి. మీరు మాత్రమే కాకుండా మరి కొంతమంది హీరోలు కూడా స్వీయ తప్పిదాలతో తమ కెరియర్ను ప్రమాదంలోకి నెట్టి వేసుకుంటున్నారు.