ఈ మధ్యన ప్రతీ ఒక్కరు కూడా ఇంటర్నెట్ ని (check internet speed) వాడుతున్నారు. ఇంటర్నెట్ వచ్చాక మనకి అన్నీ ఈజీ అయ్యిపోతున్నాయి. సులభంగా మనం మనకి కావాల్సిన పనులని పూర్తి చెయ్యచ్చు. ఇది ఇలా ఉంటే ఫేస్‌బుక్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఫోన్ లో లేదా సిస్టమ్‌లో ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్ యాప్ ను ఓపెన్ చేసి వాడుతూనే ఉంటారు. అయితే సాధారణంగా మనం వాడే స్మార్ట్ ఫోన్‌లో లేదా సిస్టమ్‌లో ఇంటర్నెట్ వేగం ఎంత ఉందో చెక్ చేయాలనీ ఉంటుంది.
అందుకోసం చాలా మంది గూగుల్‌లో కనిపించే టూల్స్ వాడుతుంటారు. ఇందుకోసం ఫాస్ట్.కామ్, ఓక్లా ఇలాంటివి. అలా కాకుండా మీరు మీ ఫేస్‌బుక్ యాప్ ద్వారానే తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ వేగం ఎంత ఉందో ఫేస్ బుక్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఓ కొత్త ఫీచర్ ని ఫేస్ బుక్ తీసుకు వచ్చింది. కొత్త ఇంటర్‌ఫేస్ యూజర్ల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు అలానే యుూజర్లు సులభంగా ఇంటర్నెట్ స్పీడ్ తెలుసుకునేందుకు ఈ ఫిచ్చర్ ని తెచ్చింది.
స్మార్ట్‌ఫోన్ లేదా సిస్టమ్‌లో ఫేస్ బుక్ యాప్ ని ఓపెన్ చేసుకోండి. ఫేస్బుక్ లైట్ లో ఈ ఫీచర్ లేదు. యాప్ ని ఓపెన్ చేసాక టాప్‌లో కుడి వైపున ఉన్న మూడు గీతాల పై నొక్కండి. ఇప్పుడు మీకు ఒక కొత్త మెనూ ఓపెన్ వస్తుంది. అందులో సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఆప్షన్‌పై నొక్కండి. మళ్లీ కొన్ని ఆప్షన్లు వస్తాయి. కిందికి స్క్రోల్ చేయండి. వైఫై, సెల్యూలార్, యువర్ స్పీడ్ అని మీకు ఆప్షన్లు కనిపిస్తాయి. వైఫై ఆప్షన్ సెలెక్ట్ చెయ్యండి. చెక్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్ అనే ఆప్షన్ దాని కింద ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. స్పీడ్ వస్తుంది.