ఆ హీరోతో త్రిష ఎఫైర్ పెట్టుకోవడం వల్లే ప్రభాస్ త్రిషని పెళ్లి చేసుకోలేదా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటినటుల మధ్య ఇప్పటికీ ఎన్నో ఎఫైర్ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇక అందులో కొన్ని నిజాలైతే మరికొన్ని రూమర్స్ మాత్రమే. ఇక ప్రస్తుతం వెండితెర మీద ఎక్కువగా వినిపించే పేరు ప్రభాస్ అనుష్క.. వీరి గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. కానీ గతంలో ప్రభాస్ త్రిష ని ప్రేమించారట.

ప్రభాస్ త్రిష ని పెళ్లి చేసుకోవాలని కూడా చూశారట. మరి వీరి పెళ్లి జరగకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాస్ త్రిష కాంబినేషన్లో వర్షం, పౌర్ణమి, బుజ్జి గాడు వంటి లవ్ రొమాంటిక్ సినిమాలు వచ్చాయి. ప్రభాస్ త్రిష ప్రేమలో పడ్డారని, త్రిషతో ప్రభాస్ కి ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని గతంలో వార్తలు వినిపించాయి.

అయితే గతంలో నిజంగానే ప్రభాస్ త్రిష ప్రేమించుకున్నారట.కానీ త్రిష కోలీవుడ్ లో నటించే టైంలో హీరో విజయ్ తో ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి.అంతేకాకుండా అప్పటికే విజయ్ కి పెళ్లి అయిపోయింది కాబట్టి త్రిష విజయ్ ని పెళ్లి చేసుకోలేదట.

ఒకవేళ పెళ్లి కాకపోతే త్రిష విజయ్ ని కచ్చితంగా పెళ్లి చేసుకునే వారంటూ గతంలో మీడియాలో చాలా వార్తలు విడిపించాయి. అయితే విజయ్ త్రిష ల మధ్య ఉన్న ఎఫైర్ తెలుసుకున్న ప్రభాస్ త్రిష క్యారెక్టర్ నచ్చక ఆమెకు బ్రేకప్ చెప్పారట. ఇక అప్పటినుండి ప్రభాస్ త్రిష మొహం చూడడానికి కూడా ఇష్టపడడట.