హీరో శ్రీకాంత్ ఊహ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే శ్రీకాంత్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందునుండే ఊహ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతోంది. ఇక శ్రీకాంత్ మొదట్లో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించారు.ఆ తర్వాత హీరోగా మారి ఇటు కుటుంబ కథా ప్రేక్షకులను అటు కుర్రకారను తన సినిమాలతో మెప్పించారు.
అలాంటి శ్రీకాంత్ కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో అలాగే అఖండ సినిమాతో విలన్ గా కూడా మారారు. ఇక శ్రీకాంత్ హీరోయిన్ ఊహని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీరి పెళ్లి టైం లో ఆ స్టార్ హీరో లేకపోతే శ్రీకాంత్ ఊహల పెళ్లి జరిగేది కాదట. మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు చిరంజీవి.మెగాస్టార్ చిరంజీవి వల్లే శ్రీకాంత్ ఊహల పెళ్లి జరిగిందట.
శ్రీకాంత్ ఊహలు నాలుగు సినిమాల్లో కలిసి నటించేసరికి వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకునే వరకు వెళ్లారట. కానీ ఈ విషయం ఊహ తల్లిదండ్రులకు తెలిసి పెళ్లికి అసలు ఒప్పుకోలేదట.అంతేకాదు ఊహకి పెళ్లి చేయాలని,పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారట.దాంతో ఈ విషయం చిరంజీవికి తెలియడంతో చిరంజీవి ఎలాగైనా శ్రీకాంత్ ఊహల పెళ్లి చేయాలని పట్టుబట్టి మరీ ఊహ ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులతో శ్రీకాంత్ మంచితనం గురించి చెప్పుకొచ్చారట.
ఇక ఊహ తల్లిదండ్రులు కూడా శ్రీకాంత్ గురించి తెలిసి ఊహని ఇచ్చి పెళ్లి చేశారట.ఇక ఆ టైంలో మెగాస్టార్ చిరంజీవి గనుక లేకపోతే శ్రీకాంత్ ఊహల పెళ్లి జరిగేది కాదని ఈ విషయం తెలిసిన కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఎప్పుడైతే చిరంజీవి శ్రీకాంత్ పెళ్లి చేశారో అప్పటినుండి శ్రీకాంత్ చిరంజీవిని ప్రేమగా అన్నయ్య అని పిలవడం మొదలుపెట్టారు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శ్రీకాంత్ ఊహ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త వినిపించిన సంగతి మనకు తెలిసిందే.కానీ ఈ వార్తలపై ఫైర్ అయిన శ్రీకాంత్ మేం విడాకులు తీసుకోవడం ఏంటి అంటూ కొట్టిపారేశారు.