కొంతమంది దేవుళ్ళని నమ్మితే కొంత మంది మాత్రం అస్సలు దేవుళ్ళని నమ్మరు. సెలబ్రిటీల లో కూడా చాలా మంది దేవుళ్ళని నమ్మే వాళ్ళు ఉన్నారు నిజానికి కొందరు దేవుడు లేడని అంటూ ఉంటారు. దేవుడు ఉన్నాడని అస్సలు ఒప్పుకోరు కూడా. ఒక్కొక్క సారి కొంత మంది చావు అంచుల వరకు వెళ్లి మళ్లీ బతికి వస్తే అప్పుడు దేవుడు ఉన్నారని భావిస్తారు అప్పటి వరకు నమ్మరు కూడా. సాయి ధరమ్ తేజ్, సమంత, సాయి పల్లవి కి భగవంతుడు అంటే ఎంతో నమ్మకం ఈ ముగ్గురు గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. వీళ్ళ ముగ్గురు కూడా భగవంతుడుని ఎంత గానో నమ్ముతున్నారు.
వీళ్ళ చేతి లో రుద్రాక్ష మాల కూడా ఉంది ఎక్కడ చూస్తున్నా ఇప్పుడు వీళ్ల చేతి లో రుద్రాక్ష మాల పెట్టుకుని కనబడుతున్నారు. అసలు మరి ఎందుకు రుద్రాక్ష మాల ని వీళ్ళు ధరిస్తున్నారు.. రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చూస్తే.. సాయి పల్లవికి భగవంతుడు మీద నమ్మకం చాలా ఎక్కువ అందుకని మొదటి నుండి కూడా ఆమె రుద్రాక్ష మాల ధరించేది.
ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉండడం వలన సాయి పల్లవి ఎప్పుడు కూడా రుద్రాక్షమాలని చేతిలో పట్టుకుని కనబడేది. ఇక సమంత విషయానికి వస్తే సమంత మయోసైటిస్తో బాధ పడిన విషయం తెలిసిందే సమంత ప్రశాంతంగా ఉండాలని మనోధైర్యాన్ని కలిగించడం కోసం రుద్రాక్ష మాలని ధరిస్తోంది.
సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురై ప్రాణల తో బయట పడ్డప్పటి నుండి కూడా రుద్రాక్ష మాలని ధరిస్తున్నారు మానసిక ప్రశాంతత కోసం మనో ధైర్యం కోసమే సాయి ధరమ్ తేజ్ రుద్రాక్ష మాలని ధరిస్తున్నారు జపం చేస్తున్నారు అందుకే ఈ ముగ్గురు మధ్య ఈ కామన్ పాయింట్ మనకి కనపడుతోంది. ఈ ముగ్గురు సెలబ్రిటీలలో ఉండే కామన్ పాయింట్ ఇదే.