సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ జాబ్స్ ఇప్పుడు 9,630కి పెరిగాయి.. అప్లై చేసేయండి మరి..!!

జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధి లో వున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్‌ ఉద్యోగాల సంఖ్యను పెంచింది. ఆసక్తి, అర్హత ఉంటే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చెయ్యచ్చు. అదనంగా 148 పోస్టులను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటన చేసింది. పూర్తి వివరాలు ని చూస్తే… మొత్తం పోస్టుల సంఖ్య 9,360కి పెరిగింది. 9,212 కానిస్టేబుల్‌ (టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌) పోస్టులు వున్నాయి. వాటిని భర్తీ చేస్తోంది.

పదో తరగతి, ఐటీఐ ప్యాస్ అయిన పురుష/మహిళా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసేయచ్చు. ఏప్రిల్‌ 25తో దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును కూడా పొడిగించారు. మే 2 వరకు ఎక్స్టెండ్ చేసారు. సీఆర్‌పీఎఫ్‌ తన ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పింది. అలానే వయోపరిమితి నిబంధనల్లో కూడా మార్పులు చేసింది. కానిస్టేబుల్‌(డ్రైవర్‌) పోస్టులకు అయితే గతం లో 21 నుంచి 27 ఏళ్ల పరిమితి ఉండగా ఇప్పుడు దాన్ని 21 నుంచి 30 ఏళ్లకు సడలించింది.

ఇక పోస్టుల గురించి చూస్తే.. టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్‌మన్, మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, బార్బర్, సఫాయి కర్మచారి, మేసన్‌, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులు వున్నాయి. గతంలో 18 నుంచి 23 ఏళ్ల వయోపరిమితి వుంది. ఇప్పుడు ఇందులో కూడా మార్పు చేసారు. ప్రస్తుతం 18 నుంచి 26 ఏళ్లకు పెంచారు. ఎత్తు, ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్టులకు సంబంధించి కూడా కొన్ని మార్పులు చేశారు.