Business:మహిళలు రోజు 3 గంటలు కష్టపడితే చాలు.. నెలకు లక్షల్లో సంపాదన పక్కా..?

చాలామంది మహిళలు ఇంట్లో వంటలు చేస్తూ వంటింటికే పరిమితం అవుతూ ఉంటారు. రోజస్తమానం చాలా వరకు ఖాళీగా ఉంటూ బోర్ గా ఫీల్ అవుతారు. ఏదైనా జాబ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికి సదవకాశం. చక్కగా వంటలు చేసే టాలెంట్ ఉంటే, నెలకు లక్షల్లో సంపాదించుకోవచ్చు.. అది మీ ఇంటి నుంచే.. రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు కష్టపడితే చాలు లక్షల సంపాదన మీ సొంతం..

మరి ఆ వ్యాపారం ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే పూర్తి వివరాలు చూద్దాం.. ఈరోజుల్లో చాలామంది చక్కనైన ఇంటి ఫుడ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక సిటీలో ఉద్యోగాలు చేస్తున్న వారు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న యువత రోడ్ సైడ్ ఫుడ్ నే ఎక్కువగా తింటూ ఉంటారు. ఒక్కోసారి ఈ ఫుడ్ తిని ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అలాంటి వారి కోసం మీరు ఇంటిలో తయారు చేసిన హోమ్ టిఫిన్ తయారుచేసి ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చు..

తక్కువ పెట్టుబడి:

మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రత్యేకమైన స్థలం అవసరం ఏమీ లేదు. ఒకవేళ ఉంటే పర్లేదు. ముందుగా మీ వ్యాపారం వంటగది నుంచే ప్రారంభించండి. దీనికి రూ. ఎనిమిది వేల నుంచి పదివేల ఖర్చు రావచ్చు. ముఖ్యంగా మౌత్ పబ్లిసిటీ ఉపయోగపడుతుంది. రోజు మీరు తయారు చేసే టిఫిన్స్ ఇతర ఆహార పదార్థాలు బయట అమ్మడం ద్వారా రోజుకు వేలాది రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇక మహిళలు సోషల్ మీడియా ద్వారా కూడా మీ వ్యాపారాన్ని సులభంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం మీలో అన్ని రకాల వంటలు చేసే టాలెంట్ ఉంటే ఈ బిజినెస్ వెంటనే ప్రారంభించడి.