పచ్చబంగారంగా పిలువబడే ఈ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని పండించారంటే కోట్లాది రూపాయలు మనం సంపాదించుకోవచ్చు. ఇంతకీ ఆ పంట ఏంటో వివరాలు చూద్దాం.. పేదవాడి కలప గా భావించే వెదురు (Bamboo trees) పెంచడం ద్వారా అనేక లాభాలు ఉంటాయి. కేవలం అటవీ ప్రాంతానికి పరిమితమైన ఈ పంటను మైదాన ప్రాంతాల్లో కూడా సాగు చేయించే లక్ష్యంతో ప్రభుత్వం అవగాహన కల్పిస్తూ సబ్సిడీ ఇస్తోంది.
ఇవి ఒక్కసారి నాటితే చాలు 70 సంవత్సరాలు పాటు నిరంతరాయంగా దిగుబడినిస్తూనే ఉంటాయి. 60 అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ మొక్కల రకాలను బట్టి మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో 30 టన్నుల వరకు దిగుబడి లభిస్తుంది. అయితే పంట పెట్టేటప్పుడు మొదటి సంవత్సరం ఇక్కడ 60 వేల పెట్టుబడి అవుతుంది. ఇక తర్వాత పదివేల రూపాయల ఖర్చు చేస్తే చాలు రూ. 50 వేల నుంచి 70 వేల వరకు ఆదాయం పొందవచ్చు.
ఇకపోతేలో 140కి పైగా రకాలు ఉన్నాయి. ఇందులో మన ప్రాంతానికి వర్కౌట్ అయ్యే అనువైన వెదురు (Bamboo) మొక్కలు ఎంచుకోవాలి. ఇక మార్కెట్లో డిమాండ్ ఉన్నవి 14 రకాలే కాబట్టి వెదురు సాగు చేయించడం వల్ల భూమి సారవంతం అవుతుంది. ముఖ్యంగా వీటిని పోడు భూములలో పొలం గట్ల మీద పెంచితే బాగుంటుంది. అయితే ఒక్కో మొక్కకు మూడు సంవత్సరాల పాటు 240 రూపాయల ఖర్చవుతుంది.
ఇక ప్రైవేట్ భూముల్లో సాగు చేసే వారికి 50% సబ్సిడీ. ఇక ప్రభుత్వ భూములు సాగు చేసే వారికి 100% సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇకపోతే మొదటి ఏడాది 50%, రెండవ ఏడాది 30%, మూడవ ఏడాది 20 శాతం సబ్సిడీ అందిస్తుంది. ఇప్పటికే చాలామంది పెద్ద పెద్ద నర్సరీలను ఏర్పాటు చేసి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మరి ఎందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా వెదురు (Bamboo) పెంచి లక్షలాది రూపాయలు లాభాలు పొందండి.