మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్యకాలంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఆస్కార్ అవార్డు కోసం హాలీవుడ్ రేంజ్ లో రామ్ చరణ్ ఇంటర్వ్యూలు ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి రాంచరణ్ ప్రస్తుతం మూడు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఇక ఈ విషయం తెలియడంతోనే ఫ్యాన్స్ అందరికి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి రామ్ చరణ్ సినిమాలకు ఎందుకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రెగ్నెంట్ అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే భార్య ప్రెగ్నెంట్ కావడంతో రాంచరణ్ మూడు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాడు.
దానికి ప్రధాన కారణం ఏ భార్య ప్రెగ్నెంట్ అయినా కూడా తనకి తోడుగా తన భర్త ఉండాలి అని భావిస్తారు. ఇక ఈ విషయంలో ఉపాసన కూడా అలాగే భావిస్తుంది. అందుకే రామ్ చరణ్ డెలివరీ టైం వరకు ఉపాసనతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడట. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక మూడు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు.అయితే ఈ విషయం తెలిసి కొంతమంది మెచ్చుకుంటుంటే మరి కొంతమందేమో ఇలా సినిమాలకు బ్రేక్ ఇస్తే ఆ ప్రభావం నెక్స్ట్ విడుదలవ్వబోయే సినిమాపై పడుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.