అంగన్‌వాడీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు.. త్వరగా అప్లై చేసేయండి మరి..!!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు ఇదే శుభవార్త. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లోని మహిళా శిశు సంక్షేమ శాఖ లో కొన్ని పోస్టులు ఖాళీ వున్నాయి. ఆసక్తి, అర్హత కనుక ఉంటే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చెయ్యచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకుల పోస్టులను భర్తీ చెయ్యాలని ఆదేశించారు.

ఈ విషయం పై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించడం జరిగింది. మరిన్ని వివరాల లోకి వెళితే… అర్హత వివరాలు చూసుకుని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లోని మహిళా శిశు సంక్షేమ శాఖ లో వున్న పోస్టులు కోసం దరఖాస్తు చెయ్యవచ్చు. అలానే
అంగన్‌వాడీలలో నాడు-నేడు పనుల ప్రగతి పై సీఎం జగన్‌ అధికార్లతో మాట్లాడారు.

మారిన సుమారు 10వేలకు పైగా అంగన్‌వాడీల్లో పనులు సరిగ్గా అవుతున్నాయా లేదా అని కూడా జగన్ అడిగారు. ఫౌండేషన్‌ స్కూళ్లలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ అభివృద్ధి పై శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే. మిగిలిన సుమారు 45వేల అంగన్‌వాడీల లోనూ పనులు సరిగ్గా టైం కి పూర్తి కావాలని అన్నారు. వీటితో పాటుగా పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే గ్రోత్‌ మానిటరింగ్‌ ఎక్విప్‌మెంట్‌ను కలిపించాలని. వెంటనే ఏర్పాటు చెయ్యాలి అని జగన్ అన్నారు.

సంపూర్ణ పోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్‌ఓపీ ని కూడా తీసుకు రావాలని అన్నారు జగన్. అంగన్‌వాడీ సెంటర్లను పరిశీలిస్తూ వాటిని మెరుగుపరిచేలా చర్యలు తీసుకోమని కూడా చెప్పారు. ఇది ఇలా ఉండగా పింఛన్లు తరహా లోనే సంపూర్ణ పోషణ పంపిణీ లో కూడా ఎటువంటి రాజీ పడద్దు అని జగన్ ఆదేశించారు. అంతే కాదు ఎప్పటికప్పుడు అంగన్‌వాడీ సెంటర్లను పరిశీలిస్తూ ఉండాలని అన్నారు. ప్రతి అంగన్‌వాడీల్లో సూపర్‌ వైజర్లపైన పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలన్నారు.