వేసవికాలం వస్తే చాలామంది కూల్ డ్రింక్స్ తాగడం, కూల్ వాటర్ తాగడం,జ్యూసులు,కొబ్బరి నీళ్లు వంటివి తాగడం మొదలు పెడతారు..అంతేకాకుండా వేసేవి కాలంలో పుచ్చకాయ ఎక్కువగా లభిస్తుంది కాబట్టి చాలామంది పుచ్చకాయను ఎక్కువగా తింటూ ఉంటారు.అయితే వేసవికాలంలో మాత్రమే పుచ్చకాయలు దొరుకుతాయని చాలామంది మోతాదుని మించి తింటూ ఉంటారు.
అయితే అలా పుచ్చకాయ ఎక్కువగా తింటే అనారోగ్యం బారిన పడ్డట్లే. మరి పుచ్చకాయ ఎక్కువగా తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి కాలంలో ఎక్కువగా లభించే పుచ్చకాయ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. కానీ దాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. పుచ్చకాయ తినడం వల్ల మన శరీరంలో ఉన్న కొవ్వు తగ్గేలా చేస్తుంది.అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు కూడా బయటకు పోతాయి.
అయితే పుచ్చకాయని తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో దాన్ని అధికంగా తినడం వల్ల అన్ని నష్టాలే ఉన్నాయి. పుచ్చకాయ ఎక్కువగా తినడం వల్ల పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా దీన్ని ఎక్కువ మోతాదులో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ఫలితంగా డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది.
మరి ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయను అధికంగా తీసుకోకపోవడమే మంచిది.అలాగే పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల ఎక్కువగా ఆకలి వేసి ఫలితంగా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పుచ్చకాయకు తక్కువగా తినడం మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.