పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడం వెనుక ఇంత చరిత్ర ఉందని మీకు తెలుసా..?

ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లంటే ఫోటోషూట్ లకే పరిమితమైంది. పెళ్లికి ముందే అబ్బాయి అమ్మాయి కలిసి తిరుగుతున్నారు. కానీ పూర్వకాలంలో పెళ్లిచూపుల నుంచి స్టార్ట్ అయితే పెళ్లయ్యే వరకు అబ్బాయి అమ్మాయి చూసుకునే వారు కాదు. చివరికి వివాహ టైం లో పెళ్లికూతురు పెళ్లికూతురుల మధ్య ఒక తెరని ఉంచి వధూవరుల తల మీద ఒకరికొకరు జీలకర్ర బెల్లం ఉంచిన తర్వాతే వారి మధ్య తెరని తొలగించేవారు.

అప్పుడే ఒకరి ముఖాన్ని మరొకరు చూడాలని చెబుతారు. వధూవరుల స్పర్శ, చూపు రెండు కూడా శుభప్రదంగా ఉండేందుకే ఈ నియమం పాటిస్తారు. జీలకర్ర బెల్లం రెండింటికి వేరువేరు లక్షణాలు ఉంటాయి. బెల్లం ఎలాంటి అవకాశం మిగల్చకుండా కరిగిపోతుంది. జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పు లేకుండా అంటిపెట్టుకొని ఉన్న పదార్థానికి సద్గుణాలను అందిస్తుంది.

వివాహ బంధంతో ఒకరిలో ఒకరు కరిగిపోతూనే అస్తిత్వాన్ని వారు నిలుపుకోవాలని తనలోని సద్గుణాలని ఎదుటివారికి అందించాలని ఈ రెండు పదార్థాలు కలయిక మనకి చెబుతుంది. జీలకర్ర బెల్లం కలయికలో మరో అర్థం కూడా ఉంది. ఈ రెండు పూర్తి భిన్నమైన పదార్థాలు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది.

ఒకటి చలవ చేయడం దగ్గరనుంచి రక్తహీనతను తగ్గించడం వరకు జీలకర్ర బెల్లం చాలా సమస్యల్ని పరిష్కరిస్తాయి. ఈ రెండింటి కలయిక వల్ల శక్తి ఉద్భవిస్తుందని కొందరు నమ్ముతారు. అలాగే జీలకర్ర బెల్లం కి ముసలితనం రాకుండా చేసే ప్రభావం కూడా ఉంటుందట. బెల్లం అమృతంతో సమానం అన్న అర్థం ఉంది. ఈ రెండు కలిస్తే ఇంకేముంది కలకాలం నిత్య యవ్వనంతో ఉంటారని పూర్వికుల దీవెనగా భావిస్తారు.