రేవంత్ ని ఏడిపించిన ఈటల..అమ్మవారి సాక్షిగా ప్రమాణం..!!

ప్రస్తుతం తెలంగాణ లో రాజకీయాల వేడి రాజు కుంటోంది. ఇటీవల ఒక సమావేశం లో ఈటల రాజేందర్ కాంగ్రెస్ టీపీసీసీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఎన్నికల సమయం లో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కు రూ.25 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ఈ క్రమం లో స్పందించిన రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం లో ప్రమాణం చేస్తానని, దీని పై ఈటల రాజేందర్ కూడా ప్రమాణం చేయాలని ఒక సవాల్ విసిరారు.

ఈ సందర్భం లో భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి చేరుకున్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమ్మవారి సాక్షి గా ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో కెసిఆర్ సహకారం కాంగ్రెస్ (Congress) తీసుకోలేదని, ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతామని అన్నారు. ఒకవేళ మీ ఆరోపణలు అబద్దాలైతే మీరు ఏమవుతారో మీకే తెలుసని తెలిపారు.

నాకు భయం ఉండదు నేను ఒక హిందువు ని,నేను అమ్మవారి ని నమ్ముతా, నేను అబద్ధం చెప్తే సర్వనాశనం అవుతా అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్న అంటూ ఎమోషనల్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఈటెల రాజేందర్ (Etela Rajender) ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. దానికి ఆధారాలు చూపలేనని ఈటలే చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆ ఎన్నికల్లో గెలవడం కోసం బిజెపి (BJP) , బిఆర్ఎస్ (BRS) లు వందల కోట్లు ఖర్చు చేసిన విషయం మన ప్రజలందరికీ తెలుసని ఆరోపించారు.