ముకేశ్ అంబానీ వంట మనిషి జీతం ఎన్ని లక్షలో తెలిస్తే దిమ్మతిరుగుద్ది..!!

ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు ముఖేష్ అంబానీ. రిలయన్స్, జియో అధినేతగా ముకేశ్ అంబానీ రోజుకు కొన్ని వందల కోట్లు సంపాదిస్తున్నాడు.అలాగే ఈయనకి సంబంధించి ఏ విషయమైనా కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. ఒక స్టార్ సెలబ్రిటీకి మించి ఈయన ఫేమస్ అయ్యారు.

అలాంటి అంబానీ నివాసం ముంబైలో చాలా విశాలంగా ఉంటుంది.ఇక 27 అంతస్తుల ఈ భవనంలో ఎన్నో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.అంతేకాదు ముకేశ్ అంబానీ ఉండే ఇంటిని యాంటీనా అని పిలుస్తారు. అలాంటి ముకేశ్ అంబానీ ఇంట్లో దాదాపు 600 మంది పనివాళ్ళు ఉంటారు.

ఇక ఒక్కొక్క పనివారికి ఒక్క రకంగా వారికి జీతభత్యాలు చెల్లిస్తూ ఉంటారు.ఇక వాళ్ల దగ్గర పనిచేసే అందరి జీతాలు లక్షల్లోనే ఉంటాయి.ప్రతి పనికి వేరువేరుగా పనిమనిషులు ఉన్నారు. అలాగే ముకేశ్ అంబానికి వంట చేసే చెఫ్ జీతమే నెలకు రెండు లక్షలు అంటే సంవత్సరానికి 24 లక్షలు ఉంటుంది.

ఇక ఈ లెక్కన మిగతా పని మనుషులకి ముకేశ్ అంబానీ నెలకు ఎంత చెల్లిస్తారో అర్థం చేసుకోవచ్చు.ఇక ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసే పని వాళ్ళ కుటుంబానికి సంబంధించి కావలసిన అన్ని సదుపాయాలను ముకేశ్ అంబానీ కుటుంబమే తీసుకుంటుంది.వారి పిల్లల చదువు దగ్గర్నుంచి మిగతా ఏ అవసరమైన సరే ముకేశ్ అంబానీ కుటుంబమే భరిస్తుంది.