తల స్నానం చేసేటప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు.. చేస్తే..!!

చాలామంది ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు బయట దుమ్ము ధూళి జుట్టుపై పడడంతో ఇంటికి రావడంతోనే తలస్నానం చేయడం మొదలు పెడతారు. కానీ అలా రోజు తల స్నానం చేయడం మంచిది కాదు. అలా తలస్నానం చేయడం వల్ల జుట్టుపై సహజ నూనెలు తొలగిపోయి జుట్టు తన సహజత్వాన్ని కోల్పోతుంది.అలాగే పొడిగా నిర్జీవంగా మారి ఎక్కువగా ఊడిపోతుంది.

అలాగే తల స్నానం చేసేటప్పుడు జుట్టుని ఎక్కువగా రుద్దకూడదు.అంతే కాకుండా తలంటూ స్నానం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ వేడి నీటిని ఉపయోగిస్తారు. కానీ అలా వేడి నీటిని ఉపయోగించడం వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. అందుకే గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం మంచిది. ఒకవేళ వేడి నీటిని ఉపయోగించినట్లయితే జుట్టుపై ఉండే క్యూటికల్ పైకి లేవడం వల్ల మన జుట్టు తొందరగా ఊడిపోవడం జరుగుతుంది.

అలాగే వెంట్రుక చివర్లు కూడా చిట్లి పోతాయి. ఇక కొంతమంది బిజీ లైఫ్ లో భాగంగా తలస్నానం చేసేటప్పుడు షాంపూ పెట్టుకోకుండా గబగబా చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల జుట్టు లో ఉండే మురికి అలాగే ఉండిపోయి ఫలితంగా జుట్టు రాలిపోతుంది. ఎక్కువగా రుద్దినా కూడా వెంట్రుకలు చిక్కు అయిపోయి ఎక్కువగా ఊడిపోతాయి.

అలాగే తలస్నానం చేసేటప్పుడు చాలా స్మూత్ గా జుట్టును రుద్దుకోవాలి. అలాగే హానికరమైన షాంపులను కూడా తలస్నానానికి ఉపయోగించకూడదు. అంతేకాకుండా ప్రతిరోజు తలస్నానం కాకుండా రెండు మూడు రోజులకు ఒకసారి తల స్నానం చేయడం ఉత్తమం.ఈ విధంగా తలస్నానం చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయకుండా ఉంటే అందమైన జుట్టు మీ సొంతం.