ఎంబీఏ తో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు..!!

మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్‌ హౌజింగ్ బ్యాంక్‌ పలు పోస్టుల భర్తీ కి నోటిపికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కి అప్లై చెయ్యవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో కొన్ని పోస్టులు వున్నాయి. ఈ పోస్టుల కోసం సంబంధిత విభాగం లో అనుభవం ఉన్న వారు ఎవరైనా సరే దరఖాస్తు చెయ్యవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు.

మొత్తం 40 ఖాళీలు దీనిలో వున్నాయి. పోస్టుల వివరాలు చూస్తే సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్ వంటి పోస్ట్స్ వున్నాయి. దరఖాస్తు చేసుకునే పోస్టుల ఆధారంగా గ్రాడ్యుయేషన్‌, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ ప్యాస్ అయ్యి ఉండాలి. అంతే కాక సంబంధిత విభాగంలో 5 నుంచి 15 ఏళ్ల ప‌ని అనుభవం కూడా తప్పకుండా ఉండాలి.

నెలకు రూ. 2.5 నుంచి రూ. 3.5 లక్షల వరకు జీతం ఎంపికైన వాళ్ళ కి ఇస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హత, పని అనుభవం ఆధారంగా షార్ట్‌ లిస్ట్ చేస్తారు. ఆ తరవాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేస్తారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసేందుకు మే 13 వరకే అవకాశం. కనుక అప్పటి లోగా దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు ని https://nhb.org.in/లో చూడచ్చు.