భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలంటే ఈ విషయాలు తప్పనిసరి..!!

మానవ జీవితం గురించి ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాలను బోధించారు. ముఖ్యంగా ఆయన భార్యాభర్తల బంధం గురించి, అలాగే ఏ విధంగా జీవిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుందో, ఎలా ఉంటే వారి మధ్య ఉన్న అనుబంధం మరింత రెట్టింపు అవుతుందో అనే విషయాలను ఆచార్య చాణిక్యుడు చెప్పుకొచ్చారు. చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలంటే ఆ విషయాలు తప్పనిసరిగా పాటించాలట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
అనుమానం: భార్యాభర్తల మధ్య బంధం అనేది బలంగా ఉండాలంటే ఒకరిపై ఒకరు అనుమానం పెట్టుకోకూడదు. ఒకరి మీద ఒకరికి బలమైన నమ్మకం ఉంటేనే వారి దాంపత్య జీవితం ముందుకు సాగుతుంది.
 స్వేచ్ఛ: భార్యాభర్తల బంధం బాగుండాలంటే ఒకరికి ఒకరు స్వేచ్ఛ ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకరిపై ఒకరు రూల్స్ అనేవి పెట్టుకోకూడదు. వారి వ్యక్తిగత జీవితానికి స్వేచ్ఛ అనేది ఇవ్వాలి. వారి అభిరుచులు,ఇష్టా ఇష్టాలు, అభిప్రాయాలు వంటి వాటికి విలువ ఇవ్వాలి.
 
అహంకారం: భార్య భర్తల బంధం లో నువ్వెంత అనే అహంకారం ఉండకూడదు. అలా ఉండడం వల్ల ఇద్దరి మధ్య  విభేదాలు రావడం వల్ల తరచు గొడవలు జరిగి ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది.ఇక చాణిక్యుడు చెప్పిన ఈ విషయాలన్నీ పాటిస్తే భార్య భర్తల మధ్య అనుబంధం పెరిగి జీవితాంతం కలిసి ఉంటారు.