గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలామందికి వ్యవసాయ పొలం అనేది ఉంటుంది. కానీ ఎక్కువ మంది రైతులు కేవలం పంటలు పండిస్తూనే ఉంటారు తప్ప మరో వ్యాపారం చేయరు. అలా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నవారికి చక్కని అవకాశం. మరి ఆ వ్యాపారం మరెక్కడికో వెళ్లి చేయాల్సిన అవసరం లేదు. మీ వ్యవసాయం పొలం మధ్య మొదలు పెట్టవచ్చు. అది ఎలాగో చూద్దామా..
ఈ వ్యాపారంలో ముఖ్యంగా కడక్నాథ్ కోళ్లు పెంచడం మంచిది. ఈ కోళ్లను పెంచడం వల్ల ఇందులో ఉండే పోషక విలువలు ఎక్కువగా లభిస్తాయని వైద్యులు అంటున్నారు. వీటి మాంసానికి కాకుండా కోడిగుడ్లకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. మీరు ఈ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ముందుగా మీ స్థలంలో అర ఎకరం విస్తీర్ణంలో షెడ్డు నిర్మించుకోవాలి. సాధారణ నాటు కోళ్ల పద్ధతిలోనే వీటిని పెంచాల్సి ఉంటుంది.
ఈ జాతి కోళ్లను మనం పెంచుకోవాలంటే కోడి పిల్లలు ఎక్కడ లభిస్తాయో తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ జాలువా దర్ జిల్లాలో కడకనాథ్ కోడి పిల్లలు ఎక్కువగా లభిస్తాయి..వీటిని కాలమాసి అని కూడా అంటారు. కడకనాథ్ కోడి పిల్లల ధర సుమారు 60 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పలుకుతుంది. మధ్యప్రదేశ్ లోని జాలువా జిల్లాలో ఈ కోడి పిల్లలు లభిస్తాయి అని రైతులు అంటున్నారు.
ఇక వేరే మెయింటెనెన్స్ విషయానికి వస్తే వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మందులు వాడాల్సిన అవసరం లేదు. కేవలం 7 నెలల వ్యవధిలోనే ఒక్కోటి కేజీన్నర వరకు పెరుగుతుంది. సాధారణ బాయిలర్ కోడితో పోల్చితే ఇందులో కొలెస్ట్రాల్ కూడా తక్కువగా ఉంటాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ కోళ్లను తినడానికి ఎంతో మంది ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ఈ కోడి పిల్లల ఫామ్ పెడితే సుమారు నెలకు 2 లక్షల వరకు ఆదాయం సంపాదించవచ్చు.