Beauty: అబ్బాయిలూ.. అందంగా కనపడాలంటే ఇలా చెయ్యండి..!!

చాలామంది అందంగా ఉండడానికి ఎంతగానో ట్రై చేస్తారు అమ్మాయిల మాట పక్కన పెడితే అబ్బాయిలు కూడా అందంగా ఉండాలని అందుకోసం రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. నిజానికి ఎక్కువ మంది పురుషుల అందం మీద శ్రద్ధ పెట్టరు కానీ అందం పై శ్రద్ధ పెడితే అందాన్ని ఇంకాస్త పెంచుకోవచ్చు మగవాళ్ళు కూడా ఈజీ టిప్స్ ద్వారా యవ్వనంగా ఉండచ్చు. ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందొచ్చు. సున్నితమైన పొడి జిడ్డు చర్మాలు అబ్బాయిలకి ఉంటాయి. వాటికి తగ్గట్టుగా సౌందర్య ఉత్పత్తులని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. ఆయిల్ స్కిన్ ఉంటే వాటర్ బేస్ ప్రొడక్ట్స్ ని ఎంచుకోవాలి. అదే పొడి చర్మం అయితే ఆయిల్బేస్డ్ ప్రొడక్ట్స్ ని ఉపయోగించడం మంచిది.

ఇలా స్కిన్ టోన్ కి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ ని ఎంచుకోవాలి శరీరానికి రాసే సబ్బు ముఖానికి చాలామంది వాడతారు అలా చేయడం అసలు మంచిదే కాదు. మిగతా బాడీతో పోల్చుకుంటే ముఖ చర్మం సున్నితంగా ఉంటుంది అందుకని ఫేస్ వాష్ వంటివి ఉపయోగించడం మంచిది. షేవింగ్ క్రీమ్ ని ఎంచుకునేటప్పుడు కూడా చర్మానికి తగ్గదానిని ఎంపిక చేసుకోండి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి.

మీ ఫేస్ ని కడుక్కున్న తర్వాత టోనర్ ని అప్లై చేసుకోవడం మంచిది చర్మ రంద్రాలను చిన్నగా చేస్తుంది ఇది. చర్మాని మృతువుగా తేమగా ఉండేటట్టు చూస్తుంది. ఆల్కహాల్ టోనర్ కి బదులు రోజ్ వాటర్ కీరా దోస వుండే వంటివి ఎంపిక చేసుకోండి. టోనర్ తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి కాలుష్యం నుండి చర్మాన్ని ఇది కాపాడుతుంది. చర్మం పాడైపోకుండా చూస్తుంది.

అలానే మాయిశ్చరైజర్ ని కూడా తప్పక అప్లై చేసుకోవాలి అలానే బయటికి వెళ్లేటప్పుడు యువి కిరణాల నుండి రక్షణ పొందడానికి సన్ స్క్రీన్ లోషన్ ని అప్లై చేసుకోండి. నిమ్మరసం తేనే ముఖానికి పట్టిస్తే కూడా ముఖం ఫ్రెష్ గా ఉంటుంది అందంగా మారుతుంది. నారింజ రసంలో కొంచెం పసుపు వేసి ముఖానికి రాసుకొని అరగంట పాటు అలా వదిలేసి తర్వాత క్లీన్ చేసుకుంటే యవ్వనంగా కనబడతారు.