ఎక్కువ డబ్బులను కోరుకునే వాళ్ళు ఎవరు వుండరు. ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు బాగా సంపాదించాలని ఇంట్లో లక్ష్మీ దేవి ఉండాలని ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు నుండి బయట పడాలని చూస్తూ ఉంటారు కూడా. ఆర్థిక సమస్యలు ఏమి లేకుండా హాయిగా ఉండాలంటే కచ్చితంగా వీటిని ఫాలో అయ్యే తీరాలి వాస్తు ప్రకారం నడుచుకుంటే సమస్యలేమి లేకుండా సుఖంగా ఆనందంగా జీవించొచ్చు. వాస్తు దోషాలు వంటివి కూడా వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఉండవు.
వాస్తును విశ్వసిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందాలన్నా డబ్బులు మీ వెంట ఉండాలన్నా ఇంట్లో ఒక లక్ష్మీ దేవి విగ్రహాన్ని పెట్టండి. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో పెడితే బంగారం వెండి మొదలైన వాటికి లోటు ఉండదు. చక్కగా హాయిగా ఉండచ్చు. వాస్తు ప్రకారం ఇంట్లో తామర పువ్వు పై కూర్చుని వున్న లక్ష్మీ దేవి బొమ్మ కానీ విగ్రహాన్ని కానీ పెడితే ఎంతో మేలు కలుగుతుంది మీ సంపదకి లోటు ఉండదు. ఆనందం శ్రేయస్సు కూడా ఉంటుంది.
ఏనుగు పై స్వారీ చేసే లక్ష్మీ దేవిని కనుక ఇంట్లో ఉంచితే అది సంపద తలుపుల్ని తెరుస్తుంది. ఏ మాత్రం కొరత ఉండదు పొరపాటున కూడా లక్ష్మీ దేవి నిలబడి ఉన్న బొమ్మని పెట్టకండి అలాంటి అమ్మ వారి వలన ధన సంక్షోభం కలుగుతుంది. వీటితో పాటుగా మీరు మీ కష్టాన్ని నమ్ముకోవాలి చాలా మంది కష్ట పడడానికి ఇష్టపడరు నిజానికి మనం ఎంతగానో కష్టపడితే కానీ మన ఇంటి డబ్బులు ఉండవు. మనం చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కష్టపడి పని చేయాలి అప్పుడు లక్ష్మీదేవి ఆటోమేటిక్ గా వస్తుంది.