రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందిన దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD). ఈ దేవస్థానానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ నలుమూలలు ప్రపంచ దేశాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారు. వారికి నచ్చిన కానుకలు హుండీలలో వేస్తుంటారు. మరి కొంతమంది భక్తులకు అన్న ప్రసాదాలను అందిస్తారు.. మరి తిరుపతి దేవస్థానంలో అన్నదానం చేయాలంటే ఎంత ఖర్చవుతుంది.. అనే వివరాలు చూద్దాం..
టీటీడీ (TTD) అంటేనే ఎంతో ఫేమస్. ఈ గుడికి డైలీ వచ్చే ఆదాయం మూడు నుంచి నాలుగు కోట్లకు పైగానే. ఇక తిరుమల కు వెళ్లే భక్తులు ఇష్టంతో ఎంతో కొంత డబ్బును శ్రీవారి హుండీలో వేయందే బయటకు వెళ్లరు. అలాగే కొంతమంది భక్తులు అన్నదానం చేయాలని భావిస్తూ ఉంటారు. మరి తిరుపతిలో మీ పేరు మీద ఒక్కరోజు అన్నదానం చేయాలనుకుంటే భారీగానే ఖర్చు అవుతుందట..
తిరుమలలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రం ద్వారా ప్రతిరోజు 60 నుంచి 70 వేల మందికి అన్న ప్రసాదాలను అందిస్తున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంతో పాటు పాత అన్నదానం కాంప్లెక్స్ లో అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. వీటితోపాటుగా మాంబాగీచా బస్టాండ్, కేంద్రీయ విచారణ కార్యాలయం పిఎసి 1 ఫుడ్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వచ్చిన భక్తులకు ఉచితంగా అన్నం పెడుతూ వారి ఆకలిని తీరుస్తారు.
ఇలా ఒక్కరోజు అన్నదానం చేయాలనుకుంటే టీటీడీ (TTD) కి విరాళంగా ఇవ్వచ్చు. ఈ విధంగా తిరుమల భక్తులకు ఒక్కరోజు అన్నదానం చేసేందుకు 33 లక్షల ఖర్చవుతుందట. ఈ డబ్బును తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేస్తే వారు మీ పేరు మీద అన్నదానం చేస్తారు.ఈ విషయాన్ని తెలుపుతూ ఆలయ పరిసరాల్లో డిస్ప్లే బోర్డులో కూడా ప్రదర్శిస్తారు. మరెందుకు ఆలస్యం అన్నదానం చేయాలనే ఆలోచన ఉన్నవారు ఈ విధమైన ప్రాసెస్ ను ఫాలో అవ్వండి.