Business ideas: ఈ వ్యాపారంతో అదిరే లాభాలు..!

Business ideas under 10,000
Business ideas under 10,000

మంచిగా వ్యాపారం ద్వారా సక్సెస్ ని పొందాలనుకుంటున్నారా.. అయితే ఇది బెస్ట్ ఐడియా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని బిజినెస్ ద్వారా మీరు పొందవచ్చు. ఈ రోజుల్లో చాలామంది వ్యాపారం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఛాయ్ బిజినెస్ అని ఎవరికి తోచిన బిజినెస్ ని వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే ఈ రోజుల్లో కొంచెం కష్టమే పది లక్షలు వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

చాలామంది 50 లక్షలు వరకు కూడా పెట్టబడి పెడుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలంటే మినీ ఆయిల్ మిల్ బాగుంటుంది వంట నూనె లకి డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ముఖ్యంగా పండగ సీజన్లో అయితే వంట నూనె అమ్మకాలు బాగా విపరీతంగా ఉంటాయి. ఇది ఎవర్గ్రీన్ బిజినెస్ అని చెప్పొచ్చు తక్కువ పెట్టుబడితో మీరు మినీ ఆయిల్ మిల్ ని స్టార్ట్ చేయొచ్చు.

ఇది వరకు విత్తనాలు నుండి నూనెను తీయడానికి పెద్ద పెద్ద మిషన్లు కావాల్సి ఉండేవి కానీ ఇప్పుడు చిన్న మిషన్ల ద్వారానే నూనె తీసేయొచ్చు. ఇలా మీరు మిషన్ల ద్వారా సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక చిన్న గదిలో మీరు మినీ ఆయిల్ మిల్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. వంట నూనె ఎలా తయారీ బిజినెస్ ఏర్పాటు చేసుకోవడానికి మిషన్ కావాలి ఈ మిషన్ ని మీరు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఆవాలు పల్లీలు నువ్వుల నూనెని ఈ మిషన్ ద్వారా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు మీడియం సైజ్ లో ఈ వ్యాపారం చేయడానికి రెండు లక్షలు ఖర్చు అవుతుంది. ప్యాకేజింగ్ ఇతర వాటి కోసం రెండు లక్షలు కావాలి మొత్తం మీద నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంది రైతులు దగ్గర నుండి మీరు గింజల్ని కొనుగోలు చేసి నూనెను తీయొచ్చు. డిమాండ్ ఉంటుంది కాబట్టి లైసెన్స్ తీసుకుని ప్యాకేజింగ్ చేసి ఆన్లైన్లో కూడా మీరు సేల్ చేసుకోవచ్చు ఇలా ఈ బిజినెస్ ద్వారా చక్కటి లాభాలని పొందొచ్చు.