వేసవిలో మందు తగచ్చా..? ఏం అవుతుంది..?

చాలా మంది వేసవిలో ఎదుర్కొంటున్న సమస్యల్లో డిహైడ్రేషన్ ఒకటి డిహైడ్రేషన్ వలన ఎంతగానో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వేసవికాలంలో నీళ్లు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వేసవిలో వాతావరణం వేడిగా ఉంటుంది. అలాంటి టైం లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయితే వేసవి కాలంలో సమస్యలు ఏమీ కలగకూడదు అంటే వేసవికాలంలో నీళ్లు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి దానితో పాటుగా ఫ్లూయిడ్స్ ని కూడా తీసుకుంటూ ఉండాలి.

పండ్లు కూరగాయలను ఎక్కువ తీసుకోవాలి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు పండ్లు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే ఎండ వేడి ఎక్కువ ఉండడం వలన చాలామంది చల్లగా బీర్ ఆల్కహాల్ వంటివి తీసుకోవాలని అనుకుంటుంటారు సమ్మర్లో ఆల్కహాల్ తీసుకోవచ్చా తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవికాలంలో ఉష్ణోగ్రత తీవ్రంగా ఉండడం వలన డిహైడ్రేట్ అవుతూ ఉంటారు. ఆల్కహాల్ వంటివి తాగడం వలన ఇది రెట్టింపు అవుతుంది దాంతో ఆల్కహాల్ తీసుకోవడం వలన తల తిరగడం వంటి ఇబ్బందులు వస్తాయి. ఒంట్లో తగినంత నీరు లేకపోతే ఈ సమస్య కలుగుతుంది వేడి వాతావరణం లో ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది వేసవిలో ఆల్కహాల్ ని తీసుకోవడం వలన వికారం మొదలైన సమస్యలు కూడా వస్తాయి.

కాబట్టి ఆల్కహాల్ ని వేసవికాలంలో తీసుకోకుండా ఉండడం మంచిది. వేసవికాలంలో ఆల్కహాల్ ని ఎక్కువ తీసుకుంటే చర్మం యొక్క సహజత్వం దెబ్బతింటుంది సన్ బర్న్ క్యాన్సర్ వంటి సమస్యలు కూడా వస్తాయి. ఆల్కహాల్ ని వేసవి కాలంలో తీసుకుంటే కాలేయం దెబ్బతినే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఈ తప్పులు చేయకండి. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు తీసుకోకుండా ఉండడం ముఖ్యం.