భార్యకి మల్లెపూలు కొని ఇస్తే ఏం అవుతుంది..? శాస్త్రం ఏం అంటోంది..?

చాలా మంది వాళ్ల భార్యలకి మల్లెపూలను కొని తీసుకు వెళుతూ ఉంటారు ఎక్కువగా కొత్తగా పెళ్లయిన వాళ్లు పట్టుకెళ్తూ ఉంటారు. భార్యకు మల్లెపూలు కొనిస్తే ఏమవుతుంది.. పండితులు ఏం అంటున్నారు.. శాస్త్రం ఏం అంటోంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనిషిని ఎక్కువగా వేధించే సమస్యల్లో ఆర్థిక సమస్య కూడా ఒకటి. ఆర్థిక సమస్య వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక సమస్య కనుక ఉన్నట్లయితే ఆడవాళ్ళని సంతోషంగా ఉంచాలి అలాంటప్పుడు ఆర్థిక సమస్య దూరం అవుతుంది.

మగవారు భార్యకి మూరడు మల్లెపూలను తీసుకువెళ్తే భార్య ఆనందపడుతుంది ఉద్యోగంలో వ్యాపార రంగంలో తగినంత సంపాదన కనుక లేకపోతే భార్యకి కొంచెం మల్లెపూలు తీసుకు వెళ్ళండి. వాటిని ఆమె పెట్టుకుని అందంగా ముస్తాబైతే శుక్రుడు అనుగ్రహిస్తాడు అలానే పరిమళాన్ని వెదజల్లే విరజాజి పూలను కూడా తీసుకు వెళ్ళచ్చు. జాజిపూలను కూడా తీసుకు వెళ్ళచ్చు.

శుక్రుడు అనుగ్రహిస్తే ఉద్యోగులకి వ్యాపారాలకి కూడా సంపద కలుగుతుందని శాస్త్రాలు అంటున్నాయి ఒకవేళ కనుక ఆర్థిక ఇబ్బందులతో మీరు సతమతమవుతుంటే ఇలా ట్రై చేసి చూడండి. అప్పుడు ఆర్థిక బాధల నుండి గట్టెక్కచ్చు. అలానే ఆర్థిక బాధలు కనుక మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మీ ఇంట సిరులు కురుస్తాయి.

అదే విధంగా ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మీ ఇంటిని శుభ్రంగా అందంగా ఉంచుకోండి. పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అలానే ఇంట్లో ఇబ్బందులు ఏమీ లేకుండా ఆనందంగా ఉండాలంటే ఇంట్లో సరైన వెల్తురు ఉండేటట్లు చూసుకోండి. ఇది కూడా మీకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలగాలంటే ఉప్పు నీటిని స్ప్రే చేయండి. లేదంటే ఉప్పు నీటిని వాడి స్నానం చేయండి ఇవి కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి దీంతో సమస్యలకి మీరు దూరంగా ఉండొచ్చు.