Vasthu Tip’s : మీ ఇంట్లో ఇలా జరుగుతుందా.. అయితే వాస్తు దోషం ఉన్నట్లే..!!

చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు ప్రకారం తీసుకువచ్చి మరీ కిచెన్ ఎక్కడ ఉండాలి..బెడ్ రూమ్ ఎక్కడ ఉండాలి..పూజారి ఎక్కడ ఉండాలి.. బాత్రూం లో ఎక్కడ కట్టుకోవాలి..అని వాస్తు ప్రకారం కట్టుకుంటారు. ఇంకొంతమంది అయితే రెంట్ కు ఉండే వాళ్లు కూడా వాస్తును చూసే ఇంట్లో అద్దెకు దిగుతూ ఉంటారు.

అయితే మనం ఉండే ఇంట్లో వాస్తు సరిగా లేకపోతే ఇంట్లో తరచూ ఇలాంటివే జరుగుతాయట. అలా జరిగితే గనుక కచ్చితంగా మన ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉంది అని ముందుగానే గ్రహించాలని చెబుతున్నారు వాస్తు నిపుణులు. చాలామంది ఇళ్లలో వాస్తు దోషం గనుక ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు తరచూ గొడవలు పడడం చిన్న చిన్న విషయాలకి ఇంట్లో వాళ్ళ మధ్య మనస్పర్ధం ఏర్పడడం, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం, అనారోగ్యం పాలవడం వంటివి తరచూ కుటుంబ సభ్యులకు జరుగుతూ ఉంటాయట.

అయితే మానవుని లో అయస్కాంత శక్తి ఉంటుంది. అందుకే మనిషికి సెట్ కానీ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అది వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే చాలామంది వాస్తు ప్రకారమే ఇళ్లు కట్టుకుంటూ ఉంటారు. ఇక దేన్నైనా మనం నమ్మినప్పుడు దానికే కట్టుబడి ఉండాలి. అందుకే నమ్మకం అనేది మనిషికి కచ్చితంగా ఉండాలి.

నమ్మకం లేకుంటే అక్కడ ఏది నిలవదు.అందుకే దేని మీదనైనా నమ్మకాన్ని ఉంచినప్పుడు ఎలాంటి దోషం దరిచేరదని వాస్తు నిపుణులు అంటున్నారు..కేవలం వాస్తు మాత్రమే కాకుండా ఇంట్లో వాళ్ళ ప్రవర్తన కూడా బాగుంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో తులతూగుతుంది.